
గోవధ నివారణ, పశువుల సంరక్షణ బిల్లు-2020ను కర్ణాటక ప్రభుత్వం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఆవులు, దూడలను వధించకూడదు. చట్టవిరుద్ధంగా ఆవులను అమ్మడం, రవాణా చేయడం లేదా నరకడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఆమోదించడంతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ట్విటర్‌లో దుయ్యబట్టారు.