
బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్ బుధవారం 7 గంటలకు ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలతో ఓటర్లు సామాజిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలివిడతలో 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. లఖిసరాయ్ పట్టణంలోని 168వ పోలింగ్ బూత్‌లో సాంకేతిక లోపం జరగడంతో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఈ పోలింగ్‌కు పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు.