
బీహార్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ మంగళవారం జరుగుతోంది. మొత్తం 94 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా గోపాల్‌గంజ్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఫొటో తీస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నిక కేంద్రంలో ఈవీఎంలు చెడిపోయాయని వదంతుతు సృష్టించి ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా ఈరోజు జరిగే ఎన్నికల్లో ఆర్జేడి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్, ఫ్లూరల్స్ పార్టీ సీఎం అభ్యర్థి పుష్పం ప్రియా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతోంది. దీంతో వారు తమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పర్యవేక్షిస్తున్నారు.