
కర్ణాటక రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య సంఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. కన్నతండ్రే కూతరును హత్య చేసి దాచడంతో పోలీసులు చాకచక్యంగా విచారణ చేపట్టి అసలు నిజాన్ని రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మగది మండలంలోని బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత, ఇదే గ్రామానికి చెందిన పునీత్ అనే దళిత వ్యవసాయ కూలీ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన హేమలత తండ్రి కృష్ణప్ప ఆగ్రహంతో ఊగిపోయాడు దీంతో తన మేనళ్లులతో కలిసి ఈనెల 8న హేమలతను హత్య చేశాడు. అయితే మరుసటి రోజు తన కూతురు కనిపించడం లేదంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 10న తన గ్రామ సమీపంలో తన కుమార్తె మృతదేహం కనిపించందని పోలీసులకు తెలుపగా హేమలత బాయ్‌ఫ్రెండ్‌ను విచారించారు. కృష్ణప్పపై అనుమానంతో ఆయనను విచారించగా తాను హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.