
తమిళనాడులో వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాదిలో బలం పుంజుకుంటున్న బీజేపీ దక్షిణాన పాగా వేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత అన్నా డీఎంకే నాయకులు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో కలిసి పొత్తులపై చర్చించనున్నారు. అయితే ప్రముఖ సినీ స్టార్ రజనీకాంత్ గత కొంత కాలంగా రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయనతో కూడా సమావేశమయి బీజేపీలో చేరాలని కోరే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ తరువాత ఓ రిజర్వాయర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.