
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 43,082 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 492 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,35,715కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,55,555 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 87,18,517 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 93 లక్షల కేసులు దాటాయి. అయితే మరణాలు కాస్త తగ్గడంతో ఊరటనిస్తోంది.