
బాహుబలి సినిమా తరువాత దగ్గుబాటి రానా రేంజ్ పెరిగిపోయింది. ఆ తరువాత హీరోగా పలు సినిమాలు చేస్తున్న రానా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలయింది. నక్సలైట్ గెటప్ లో ఉన్న రానా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని రానా స్పెషల్ డీపీని విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ ను విడుదల చేశారు. దీంతో రానాకు బర్త్ డే శుభాకాంక్షలతో పాటు మూవీ లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.