
దేశవ్యాప్తంగా 24 గంటల్లో 70,589 కరోనా కేసులు నమోదయ్యాయి. 776 మంది వైరస్ సోకి మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,291కి చేరింది. అలాగే 96,318 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 11,42,811 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 7 కోట్ల 31 లక్షల టెస్టులు చేశారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో లక్ష వరకు పెరుగుతాయని భావించారు. కాని 90 వేల నుంచి తగ్గుతూ వస్తోంది. వ్యాధి విస్తరణ కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉంటోంది.
Also Read: నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్!