
డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్ అద్భుతమైన పద్ధతులను అవలంబిస్తోందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఇవే విధానాల్ని ఇతర దేశాల్లోనూ అమలుచేసేందుకు తమ దాతృత్వ సంస్థ కృషి చేస్తోందని వెల్లడించారు. చైనా కాకుండా మరే దేశం నుంచైనా ప్రపంచం నేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా భారత్‌వైపు చూడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో మంగళవారం జరిగిన ఓ ఫిన్‌టెక్ సదస్సులో బిల్‌గేట్స్ వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.