https://oktelugu.com/

Youth: యువత ఏం కోరుకుంటోంది..? ఎలా ఆలోచిస్తుంది..?

Youth: మీ జీవిత లక్ష్యం ఏంటని అడిగితే..? మంచి చదువు.. ఆ తరువాత మంచి ఉద్యోగం.. ఇక పెళ్లి.. ఆ తరువాత ఫ్యామిలీ లైఫ్.. అని చాలా మంది చెబుతారు.. అయితే కొందరు ఇలా చెప్పకున్నా వారి జీవితా దాదాపుగా ఇలాగే గడుస్తుంది. కానీ నేటితరం యువత మారుతోంది. పాతతరం యువతకు భిన్నంగా ఆలోచిస్తుంది. జీవితంలో పెళ్లి, ఉద్యోగమే కాదు… ఇంకేదో సాధించాలని అంటున్నారు.. ఓ గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటికోసం పరుగులు పెడుతున్నారు. అందుకోసం తీవ్రంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2022 / 03:22 PM IST
    Follow us on

    Youth: మీ జీవిత లక్ష్యం ఏంటని అడిగితే..? మంచి చదువు.. ఆ తరువాత మంచి ఉద్యోగం.. ఇక పెళ్లి.. ఆ తరువాత ఫ్యామిలీ లైఫ్.. అని చాలా మంది చెబుతారు.. అయితే కొందరు ఇలా చెప్పకున్నా వారి జీవితా దాదాపుగా ఇలాగే గడుస్తుంది. కానీ నేటితరం యువత మారుతోంది. పాతతరం యువతకు భిన్నంగా ఆలోచిస్తుంది. జీవితంలో పెళ్లి, ఉద్యోగమే కాదు… ఇంకేదో సాధించాలని అంటున్నారు.. ఓ గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటికోసం పరుగులు పెడుతున్నారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ ఒకే రంగాన్ని ఎంచుకోకుండా రకరకాల మార్గాలను ఎంచుకొని వాటి వెంట వెళుతున్నారు.

    Youth

    నేటి యువత ఎక్కువగా సొంత కాళ్లపై నిలబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకోసం ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాను నమ్ముకున్న వాళ్లు అనతి కాలంలోనే కోటీశ్వరులైనవారున్నారు. అయితే ఇందులో రాణించాలంటే ఆషామాషీ కాదు. అందుకోసం రాత్రి, పగలు కష్టపడాలి. ఒక్కోసారి రిస్క్ కూడా ఉండొచ్చు. కానీ ఎంతటికైనా తెగించేందుకు రెడీగా ముందుకు సాగుతున్నారు. ఒక్కోసారి పక్కదారి పట్టినప్పటికీ అంతిమంగా మాత్రం లక్ష్యాన్ని చేరుకున్నారు.

    Also Read:  అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?

    అయితే ఇప్పుడున్న వారంతా పాత తరాన్ని ఆదర్శంగా తీసుకోవడం లేదు. భిన్నమైన బట్టలు వేసుకుంటున్నారు. భిన్నమైన అలవాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు కనీసం రొమాంటింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి అలవాట్లు ఉన్నా వారు ఎంచుకున్న మార్గాన్ని మాత్రం సరిగ్గానే నడుతుస్తున్నారు. కొందరు యువత యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం పనిగా పెట్టుకున్నారు. కొందరు సొంతంగా కోడింగ్ నేర్చుకుంటున్నారు. మొత్తండి యువత డిజిటల్ వైపు పయనిస్తున్నారు. అలాగే కొందరు వర్క్ ఫ్రం హోం లో సంపాదిస్తున్నారు.

    Also Read:  మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

    కాలేజీలంటే కేవలం ఉద్యోగాన్ని సందపాదింటే డిగ్రీలే కాదని, ఇది ఒక ప్రయోగ శాల అని భావిస్తున్నారు. నలుగురితో పరిచయాలు పెంచుకోవడం. ఎలాంటి సంకోచం లేకుండా రిలేషిన్ మెయింటేన్ చేయడం వారికి సత్ఫలితాన్నిస్తుంది. దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కకోవడమే కాకుండా సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ఇక పెళ్లి విషయం ఎత్తే సరికి ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. తమకు నచ్చినట్లు నటిస్తూనే లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు.

    Also Read:  సినీ ఇండస్ట్రీ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్న మోహన్ బాబు