UPI Services : మన ఖాతాల్లో డబ్బులు లేకపోతే మనం ఏ పని చేయలేం. అత్యవసరంగా ఎవరైనా డబ్బులు అడిగితే.. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూపుతాం. అయితే, యూపీఐలు కస్టమర్లకు ఒక మంచి ఆఫర్ తెచ్చాయి. బ్యాంకులో బ్యాలెన్స్ లేకున్నా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించాయి. ఈ ఫీచర్‌ను యూపీఐ నౌ.. పే లేటర్ అంటారు. ఎలాగో తెలుసుకుందాం.
పెరిగిన యూపీఐల వినియోగం..
బ్యాంకుల డిజిటలైజేషన్‌లో భాగంగా యూపీఐల వినియోగం బాగా పెరిగింది. కప్పు టీ నుంచి ఖరీదైన వజ్రాలు, బంగారం వరకు పేమెంట్లు అన్నీ కార్డు లేదా యూపీఐల ద్వారా జరుగుతున్నాయి. ఆన్ డ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు బ్యాంకు బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా యూపీఐ యాప్స్ వాడుతున్నారు. ఒకప్పుడు నగదు చెల్లిపులతో జరిగే లావాదేవీలు, చెల్లింపులు అన్నీ ఇప్పుడు యూపీఐల ద్వారానే జరుగుతున్నాయి.
ముందు చెల్లింపు.. తర్వాత కట్టడం..
అయితే యూపీఐలు తమ కస్టమర్ల కోసం సర్వీస్‌లు పెంచుతున్నాయి. మొదట పేమెంట్ చేసిన తర్వాత స్క్రాచ్‌కార్డు ద్వార డబ్బులు జమ అయ్యేవి. తర్వాత వివిధ సంస్థల డిస్కౌంట్ స్క్రాచ్‌కార్డులు వస్తున్నాయి. తాజాగా అన్ని యూపీఐలు తమ కస్టమర్ల కోసం యూపీఐ.. పే లేటర్(ముందు చెల్లింపు.. తర్వాత కట్టడం..) అవకాశం తీసుకువచ్చాయి. అంటే మన ఖాతాలో ఎలాంటి డబ్బులు లేకపోయినా మనం ఇతరులకు డబ్బులు చెల్లించవచ్చు. వాటిని తర్వాత తిరిగి బ్యాంకులకు కట్టవచ్చు.
ప్రస్తుతం ఈ బ్యాంకులు..
అయితే అన్ని యూపీఐలు ఈ అవకాశం కల్పించినా.. బ్యాంకులు మాత్రం మూడే ఇందుకు అంగీకరించాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల మాత్రమే యూపీఐలతో ఒప్పందం చేసుకున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకులు కూడా ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
ఎలా చేయాలంటే..
ఇక మన ఖాతాలో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయడానికి ముందుగా గూగుల్ పే/ఫోన్ పే/ పేటీఎం ఓపెన్ చేసుకుని ప్రొఫైల్‌కు వెళ్లాలి. సెటప్, పేమెంట్, మెథడ్, యారో సింబల్స్ వస్తాయి. యారో మీద క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కిందకు స్క్రోల్ చేయగానే యాడ్ క్రెడిట్ లైన్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే యూపీఐతో ఒప్పందం ఉన్న బ్యాంకులకు మెస్సేజ్ వెళ్తుంది. వాళ్లు వెంటనే క్రెడిట్ పై డబ్బులు ఇస్తారు. తర్వాత వాటిని వెంటనే మనం ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.