https://oktelugu.com/

Tomato Price : టమోటా ధర నేర్పిన ప్రజాస్వామ్య పాఠం ఇదే..!

వాస్తవంగా మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల టమోట ధర రూ.100 రూపాయలకు చేరుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను రూపాయలు వినియోగదారుడు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల అదనంగా మరో రూ.  50 రూపాయల కిలో టమాట కోసం చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారుడుకి ఏర్పడుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2023 / 10:10 PM IST
    Follow us on

    Tomato Price : దేశంలో టమోటా ధర భారీగా పెరిగిపోతుంది. కిలో టమోటా ధర సెంచరీ దిశగా పరుగులు తీస్తోంది. ప్రస్తుత పరిస్థితికి పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిలో టమోటా కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి వినియోగదారులకు ఏర్పడింది. ఇదంతా పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్ల ఏర్పడిన దుస్థితిగా పలువురు పేర్కొంటున్నారు.

    సాధారణంగా నిత్యావసర సరుకుల ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ధరలను అదుపు చేయాలి. డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి ఉన్నదీ..? లేనిది..? చూసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల ధరలను అదుపు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ తరహా ముందు చూపు లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటా ధర భారీగా పెరిగిపోవడానికి ఇదే కారణం అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా టమోట సరఫరా ఉందో..? లేదో..? పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని పలువురు పేర్కొంటున్నారు.

    ఉచితాలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వాలు..

    కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మిస్తోంది, జాతీయస్థాయి ప్రాజెక్టులకు నిధులు ఇస్తోంది, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలను అందిస్తోంది, ఆయా రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా నిధులను సమకూరుస్తోంది.. ఇన్ని కార్యకలాపాలను కేంద్రం చేస్తుంటే.. రాష్ట్రాలు మాత్రం కనీస స్థాయిలోని ధరలను కూడా అదుపు చేయలేక ఇబ్బందులకు ప్రజలను గురి చేస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి.

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటా ధర పెరిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన విధానమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లేనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా ధర పెరగకుండా చూసుకోవచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయకుండా రూ.100 రూపాయల అయిన తర్వాత రూ.50 రూపాయల సబ్సిడీకి కిలో టమోట అందిస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సబ్సిడీ ఇస్తూ వినియోగదారులను ఆదుకుంటున్నామనే ప్రచారాన్ని. రాజకీయ అవసరాల కోసం చేసుకుంటున్నారు.

    వాస్తవంగా మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల టమోట ధర రూ.100 రూపాయలకు చేరుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను రూపాయలు వినియోగదారుడు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల అదనంగా మరో రూ.  50 రూపాయల కిలో టమాట కోసం చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారుడుకి ఏర్పడుతోంది. ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ తరహా ఇబ్బందికర ఉత్పన్నమవుతుందని, ఇది టమోటా నేర్పిన ప్రజాస్వామ్య పాఠంగా పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.