Karnataka Election Results: కర్ణాటక ఫలితాలతో థర్డ్ ఫ్రంట్ కష్టమేనా?

దశాబ్దాల పాటు రాజకీయం చేసిన శరద్ పవర్, నితీష్ కుమార్, మమతాబెనర్జీ, కేసీఆర్, చంద్రబాబులాంటి వారికి కాంగ్రెస్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి కట్టే చాన్స్ లేదని తెలుసు.

Written By: Dharma, Updated On : May 14, 2023 1:36 pm
Follow us on

Karnataka Election Results: కర్నాటకలో ఏనుగులాంటి బీజేపీని.. పీనుగులాంటి కాంగ్రెస్ మట్టికరిపించింది. అలాగని కాంగ్రెస్ ను పీనుగు అని సంభోదించడానికి మనసు అంగీకరించకున్నా.. గత తొమ్మిదేళ్లుగా ఆ పార్టీ అంతలా అచేతనంలోకి వెళ్లింది. బలమైన ప్రత్యర్థితో పోరాటం వైపు.. విపక్షాలతో మరోవైపు యుద్ధం చేస్తునే ఉంది.ఈ క్రమంలో సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీగా కాంగ్రెస్ ను దేశంలో మిగతా రాజకీయపక్షాలు చూడలేదు. కాంగ్రెస్ లేని ఒక ఫ్రంట్ కోసం ప్రాంతీయ పార్టీలు ప్రయత్నించాయి. కానీ దానికి ఒక తుదిరూపం తేలేకపోయాయి. దానికి కారణం కూడా కాంగ్రెస్ ను విస్మరించడమే. కర్నాటకలో విజయంతో కాంగ్రెస్ మర్యాద పెరిగే చాన్స్ ఉంది.

గత నాలుగేళ్లుగా..
దేశంలో గత నాలుగేళ్లుగా ఫ్రంట్ల మాట వినిపిస్తునే ఉన్నాయి. కానీ ఏ ఫ్రంటూ కార్యరూపం దాల్చిన పరిస్థితులు లేవు. బీజేపీని బూచిగా చూపిస్తున్న పలు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తూనే ఏకత్వంలోను భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా ‌చేస్తున్న వారి ప్రయత్నాలు మిగులుగుతున్నాయి. బీజేపీని ఢీకొనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదంటూనే ఆ పార్టీతో కలిసే విపక్షాల కూటమిని రూపకల్పన చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే దశాబ్దాల పాటు రాజకీయం చేసిన శరద్ పవర్, నితీష్ కుమార్, మమతాబెనర్జీ, కేసీఆర్, చంద్రబాబులాంటి వారికి కాంగ్రెస్ లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి కట్టే చాన్స్ లేదని తెలుసు.

టానిక్ లాంటి ఫలితం..
తొమ్మిదేళ్ల పాటు ఓటమి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ సాధరణ ఎన్నికలకు కూతవేట దూరంలో కర్నాటక రూపంలో విజయాన్ని అందుకుంది. దీంతో తాను లేని ఫ్రంట్ ఊహించుకోలేనిదని హెచ్చరికలు పంపింది. బీజేపీ బాధిత పార్టీలకు నేనున్నాను అంటూ సంకేతాలిచ్చింది. నిజానికి మమతా బెనర్జీ, కేసీఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతోను, సోనియా తోను సమాలోచనలు జరిపిన వారే. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే తమ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ రాజకీయం చేస్తూ వచ్చారు. అందుకే కేంద్రంలోని మోదీప్రభుత్వానికి పలు కీలక సందర్భాలలో సహకరిస్తూ వచ్చారు. కానీ 2019 తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇపుడు కాంగ్రెస్ బదులుగా బీజేపీనే కేసీఆర్ తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. బీజేపీ ఉనికి దేశానికే ప్రమాదకరమనే స్థాయిలో కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు.

ఫ్రంట్లకు చాన్స్..
ఇక మమతా బెనర్జీ కూడా ఒకట్రెండు సందర్భాలలో సోనియాతో భేటీలు నిర్వహించారు. మొన్నటి బెంగాల్ ఎన్నికలకు ముందు దీదీ స్వయంగా న్యూఢిల్లీ వెళ్ళి సోనియాతో సమావేశమయ్యారు. బీహార్‌లో బీజేపీకి హ్యాండిచ్చి..హస్తం సహకారంతో మళ్ళీ సీఎం పీఠమెక్కిన నితీశ్ కుమార్ సైతం కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్ గా ఉన్నారు. బీజేపీయేతర కూటమికి యత్నించారు. కాంగ్రెస్ యువనేత రాహల్ గాంధీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. దేశంలో ఏ ఫ్రంట్ వచ్చినా అందులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్న నేతల్లో ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్ కూడా ఉన్నారు. ఇంతమంది నేతలు బీజేపీని ధ్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పై అభిమాన భావంతో ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుండడంతో ఫ్రంట్లు పురుడుబోసుకునే అవకాశముంది.