Kailasa Temple Mystery: భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రం. ఇప్పటికే ఎన్నో కట్టడాలు యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా చేశాయి. ఇంకొ కొన్ని నిర్మాణాలు కాలగర్భంగా కలిసిపోయాయి. కొన్ని నిర్మాణాలు భూగర్భంలో జరిగాయి. ఇలాంటి నిర్మాణాల్లో ఒకటి ఔరంగాబాద్‌లోని కైలాస గుడి. కైలాస గుడి అనగానే అందరికీ కాశీ క్షేత్రం గుర్తొస్తుంది. హిందువులకు అతి పవిత్రమైన శైవ క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా ప్రతీ హిందువు కాశీని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం. కాశీ క్షేత్రంతో సమానమైన ఎన్నో శివాలయాలు మన దేశంలో ఉన్నాయి. అందులో ఒకటి మహారాష్ట్రలోని కైలాస గుడి. ఈ ఆలయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. రహస్యంగానే ఉండిపోయింది.
1876, డిసెంబర్ 8లో 12 మంది పరిశోధకులతో కూడిన బృందం కైలాస గుడి ఉన్న గుహలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం బ్రిటన్‌కు చెందిన ఓ రచయిత్రి కైలాస మందిరం కింద ఒక పెద్ద గుహ ఉందని, అందులో భిన్నంగా ప్రకాశ వంతంగా మనుషులు ఉన్నారని ఓ పుస్తకంలో రాశారు. దీనిని నిర్ధారించుకునేందుకు 12 మంది సభ్యుల బృందం గుహలోకి వెళ్లింది. వీరు 120 మీటర్లు లోపలికి వెళ్లగానే అక్కడ వాళ్లకి ఒక భయంకరమైన రూపం కనిపించింది. దానిని చూసి నిశ్చేష్టులయ్యారు. భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత ఆ గుహను మూసివేసింది. గతంలో లోనికి వెళ్లినవారెవనూ బయటకు రాలేదు. 12 మంది మాత్రం క్షేమంగా బయటకు వచ్చారు. వారు ఆలయం గురించి, గుహలో గమనించిన దృశ్యాల గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.
Also Read: Kannada TV Actress Chethana Raj: అందం కోసం ప్రాకులాట, ప్రాణాలతో హీరోయిన్ల చెలగాటం !
-వందల ఏళ్ల క్రితమే నిర్మాణం..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ ఆలయం నిర్మించారు. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారనేది తెలియదు. రహస్యాన్ని ఛేదించేందుకు వెయ్యిమంది ఇప్పటికే పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కొంతమంది అంచనాల ప్రకారం.. ఈ దేవాలయం 1900 సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. మరికొంతమంది ఆరే వేల సంవత్సరాల పురాతనమైనదిగా పేర్కొంటారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదిగా తెలిపారు. ప్రస్తుత ఎంత టెక్నాలజీ పెరిగినా అచ్చంగా ఈ మందిరంలా నిర్మించడం మాత్రం సాధ్యం కాదు. పెద్దపెద్ద రాళ్లను అద్భుతంగా చెక్కి దీనిని నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జు ఖలీఫా నిర్మించినప్పటికీ.. ఇలాంటి ఆలయం ఇప్పుడు నిర్మించడం మాత్రం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు , నిపుణులు చేతులెత్తేశారు.
-శిఖరం నుంచి నిర్మాణం..
పెద్ద రాయిని తొలచి అత్యంత అద్భుతంగా నిర్మించిన ఈ కైలాస ఆలయ నిర్మాణం శిఖరం నుంచి కిందకు చెక్కుతూ నిర్మించారంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా ఏ నిర్మాణం అయినా పునాది నుంచి మొదలు పెడతారు. కైలాస దేవాలయం మాత్రం శిఖరం నుంచి మొదలు పెట్టి నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 18 ఏళ్లలోనే ఇంత అద్భుతమైన ఆలయాన్ని చెక్కారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఎంత గొప్ప ఇంజినీర్లు, ఎత్తయిన నిర్మాణాలు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నా.. ఇలాంటి ఆలయం నిర్మించడం మాత్రం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చారు.
-గుప్త గుహలో నిర్మాణ రహస్యం..
ఆలయ నిర్మాణానికి సంబంధించిన రహస్యం ఆలయం కింద ఉన్న గుప్త గుహలో ఉన్నట్లు చెబుతారు. ఆలయం కింద పదుల సంఖ్యలో గుహలు ఉన్నాయి. అయితే వాటిని ప్రస్తుతం భారత ప్రభుత్వం మూసివేసింది. కానీ.. బ్రిటన్‌కు చెందిన ఓ రచయిత్రికి మందిరాలు, నిర్మాణాలపై పుస్తకాలు రాయడం ఆసక్తి. ఆమె కైలాస ఆలయం గురించి కూడా 1926 రాశారు. ఆలయాన్ని అణువణువూ తాను పరిశీలించానని పేర్కొన్నారు. తాను ఆలయంలోకి 100 మీటర్ల దూరం వెళ్లగానే బయటికి కనిపించే గుడికంటే అద్భుతమైన మరో గుడి లోపల ఉన్నట్లు తెలిపారు. గుహలో నివసించే ఏడుగురిని తాను చూసినట్లు పేర్కొన్నారు. వారి కళ్లు కూడా ప్రకాశవంతంగా ఉన్నట్లు, కొంతమంది అప్పుడప్పుడు మాయమవుతున్నట్లు వివరించింది. గుహలో ఒక ప్రకాశవంతమైన వస్తువును కూడా గమనించినట్లు రచయిత్రి తెలిపింది. దాని కాంతి నలువైపులా ప్రసరించడాన్ని గమనించానని పేర్కొంది. వస్తువు విశేషం తేల్చడానికే 12 మంది గుహలోకి వెళ్లారు. ఆలయ నిర్మాణం చరిత్రను కొంతవరకు ప్రపంచానికి తెలియజేశారు.
-రాణి నిర్మించినట్లు సమాచారం..
వందల ఏళ్ల క్రితం కైలాస ఆలయాన్ని ఒక రాణి నిర్మించినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన భర్తను కాపాడుకోవడానికి శివుడిని పూజించడంతోపాటు తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయం నిర్మిస్తానని మొక్కుకుంది. ఆలయం నిర్మాణం శిఖరం చుసే వరకు ఉపవాసం కూడా చేస్తానని మొక్కుకుంది. అనుకున్నట్లుగానే రాజు త్వరగా కోలుకున్నాడు. దీంతో రాణి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రాజు ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు తన భార్య ఉపవాసం చేయడం కష్టమని గ్రహించాడు. ఈ క్రమంలో రాజు శివున్ని పూజించి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై శివునికి ఆలయం శిఖర నిర్మాణం పూర్తయ్యే వరకు తన భార్య ఉపవాసం చేయడం సాధ్య కాదని, ఉపాయం చెప్పాలని వేడుకున్నాడట. ఈ సమయంలో శివుడు ఆలయ నిర్మాణం త్వరగా చేయడానికి ఒక అస్త్రాన్ని రాజుకు ఇచ్చాడట. అంతేకాకుండా నిర్మాణాన్ని పునాది నుంచి కాకుండా శిఖరం నుంచి ప్రారంభించాలని చెప్పాడట.
అలా అయితే రాణి మొదట శిఖరం చూసి ఉపవాస దీక్ష విరమిస్తుందని తెలిపాడట. శివుడు చెప్పినట్లే రాజు అస్త్రం సాయంతో ఆలయాన్ని శిఖరం నుంచి నిర్మించడం మొదలు పెట్టాడట. దీంతో రాణి ఉపవాస దీక్ష విరమించిందట. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజు శివుడు ఇచ్చిన విలువైన అస్త్రాన్ని ఆలయం కింద గుహలో దాచినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రచయిత చూసిన వస్తువు అదే అయి ఉంటుందని భావిస్తున్నారు. 12 మంది బృందం కూడా దీనినే చూసి ఉంటుందని సమాచారం. అయితే దీనిని చూసినవారెవరూ ఎక్కువ కాలం బతకలేదట. రేడియో యాక్టివ్ కిరణాల కారణంగానే చనిపోయి ఉంటారని సమాచారం. రచయిత్రకు కనబడిన ప్రకాశవంతమైన వ్యక్తులు కూడా ఆ అస్త్రానికి రక్షణగా ఉండి ఉంటారని భావిస్తున్నారు.
మొత్తానికి ఇప్పటికీ కైలాస గుడిని ఎలా నిర్మించారన్నది ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేదు. దీన్ని నిజంగా రాణియే నిర్మించిందా? లేక ఏలియన్స్ వచ్చి కట్టారా? అన్న అనుమానాలు ఆ అద్భుత శిల్ప సౌందర్యం చూస్తే కలుగకమానదు. ఎన్నో తెలుసుకున్న శాస్త్రవేత్తలకు ఈ కైలాసగుడి మిస్టరీని మాత్రం ఇప్పటికీ చేధించకపోవడం విశేషమే మరీ.
Also Read:Jagan- Early Elections: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా?