Anti ship hypersonic missile: సముద్రాల్లో దూరంగా ఉన్న శత్రు యుద్ధనౌకలను ధ్వంసం చేసే భారత్ మొదటి (ఎల్‌ఆర్‌ఎస్‌హెచ్‌ఎం) హైపర్‌సోనిక్ గ్లైడ్ మిస్సైల్ రిపబ్లిక్ డే పరేడ్‌లో దర్శనమించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఈ మిసైల్‌ను తొలిసారి ఢిల్లీలో జరిగే కవాయతులో ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన దీన్ని 2024 నవంబర్‌లో పరీక్షించారు.
ప్రత్యేకతలు ఇవీ..
ఎల్‌ఆర్‌ఎస్‌హెచ్‌ఎం 1,500 కి.మీ దూరం లక్ష్యాన్ని ఛేదిస్తుంది. గంటకు 6,100 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని బూస్ట్–గ్లైడ్ విధానం, ఏరోడైనమిక్ డిజైన్‌తో రాడార్లను మోసం చేస్తుంది. దీనిని మొబైల్ లాంచర్ నుంచి ప్రారంభిస్తారు. యుద్ధనౌకలు, భూమి లక్ష్యాలపై 100% ఖచ్చితత్వం, తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తుంది. రెండేళ్లలో సైన్యంలో చేరనుంది.
ప్రత్యేక ప్రయోజనాలు
హైపర్‌సోనిక్ వేగంతో శత్రు డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించకముందే ధ్వంసం చేస్తుంది. అన్ని రకాల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. సముద్ర, భూమి లక్ష్యాలపై సమర్థవంతం ఎదుర్కొంటుంది.
డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. ప్రసాద్ ఐదేళ్లుగా నడిపిస్తున్నారు. నంద్యాల (ఏపీ) డోంక వాసి 30 సంవత్సరాల అనుభవంతో డీఆర్‌డీఓలో ఉన్నత స్థాయికి చేరారు. ఈ సాంకేతికత భారత రక్షణాన్ని బలోపేతం చేస్తుంది.