https://oktelugu.com/

Chandrayaan 3: ఆ 60 సెకన్లే కీలకం.. చంద్రయాన్ ప్రయాణంలో కీలక ఘట్టాలివీ

చంద్రుడి దక్షిణ దృవం గురించి తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ _ 3 వ్యోమ నౌక అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.

Written By: , Updated On : August 22, 2023 / 01:51 PM IST
Chandrayaan 3

Chandrayaan 3

Follow us on

Chandrayaan 3: కోట్ల మంది భారతీయులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కంటిమీద రెప్ప వేయకుండా ఊపిరి దిగబట్టుకున్నారు. నేషనల్ మీడియా, అంతర్జాతీయ మీడియా విలేకరులు అదేపనిగా అప్డేట్స్ ఇస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం గురించి వారికి తెలిసిన సమాచారం ఇస్తున్నారు. కానీ దాని గుట్టుమట్లు మనకు తెలియాలంటే అక్కడ మూడు రంగుల పతాకం ఎగరాలి. స్థూలంగా చెప్పాలంటే చంద్రయాన్_3 చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ కావాలి. ఈ మహత్తరమైన సన్నివేశం మరి కొద్ది క్షణాల్లో ఆవిష్కృతం కాబోతోంది. ఈ వేడుకను చూసేందుకు యావత్ భారత జాతి ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

చంద్రుడి దక్షిణ దృవం గురించి తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ _ 3 వ్యోమ నౌక అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సేపట్లోనే భారత్ ప్రయోగించిన వ్యోమ నౌక జాబిల్లి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టనుంది. 14న శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్_ 3 బుధవారం సాయంత్రం 6 గంటల నాలుగు నిమిషాలకు సాఫ్ట్ గా ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. అయితే ఈ క్రమంలో 40 రోజుల చంద్రయాన్_3 ప్రయాణాన్ని 60 సెకండ్ల వీడియోలో చూపిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక వీడియో రూపొందించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం 60 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది.. చంద్రయాన్_3 తయారీ, నెల్లూరు జిల్లా షార్ వేదిక వద్ద ప్రయోగం, అది రోదసిలోకి దూసుకెళ్ళడం, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడం వంటివి ప్రముఖంగా చూపించారు. చివరిగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టినట్టు ఆ వీడియోలో ఉంది. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్ రోవడ్ జారుకుంటూ బయటికి వచ్చినట్టు ఊహాజనితమైన యానిమేషన్ రూపంలో వీడియోలో చూపించారు. ఇక శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు పరిస్థితులు మొత్తం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువం మీదికి ల్యాండర్ కాలు మోపుతుంది. ఆ తర్వాత రెండు వారాలపాటు ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలు కొనసాగిస్తాయి. ఒకవేళ ఈ ప్రయోగం గనుక ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్నట్టుగా విజయవంతం అయితే అమెరికా, రష్యా, తర్వాత జాబిల్లి మీద కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇక దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను భారత్ లిఖిస్తుంది. అమెరికా చంద్రుడు మీద చేసిన ప్రయోగాలు మొత్తం వివాదాస్పదంగా ఉన్నాయని రష్యా ఆరోపిస్తున్న నేపథ్యంలో.. చంద్రయాన్_3 ను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.