Modi Birthday: ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు. ముఖ్యంగా ఏడుపదుల వయసులో శరీరం ఇంతకుముందు మాదిరిగా చురుకుగా ఉండదు. అందువల్లే ఆ వయసులో ఉన్న వారికి విశ్రాంతి అవసరం అంటారు వైద్యులు. ఈ వయసులో ఉపవాసం కాదు కదా సాధ్యమైనంతవరకు విడుదలవారీగా ఆహారం తీసుకుంటూ ఉండాలి అంటుంటారు. కానీ ఏడుపదుల వయసులో ఉపవాసం ఉండడం సాధ్యమా. నవరాత్రి ఉత్సవాల సమయంలో కేవలం నిమ్మరసం తాగిన నీళ్లు తాగి ఉండడం వీలవుతుందా.. కటిక నేల మీద పడుకుని.. కేవలం యోగాసనాలు చేసుకుంటూ శరీర ఆకలిని అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందా.. మిగతా వారికేమో గాని.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ఇది సాధ్యమవుతుంది.
మితహారం.. అది కూడా శాకాహారం తీసుకోవడం ద్వారా నరేంద్ర మోడీ ఇప్పటికీ నిత్య యవ్వనుడిగా కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 17 తేదీతో ఆయన 76వ తంతాల్లోకి అడుగుపెడుతున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రధానమంత్రిగా అడిగారు. గుజరాత్ రాష్ట్రానికి 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేశారు. గడచిన 11 సంవత్సరాలుగా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం నరేంద్ర మోడీ సొంతం. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఆయన మీద వచ్చాయి. అదే సమయంలో ప్రశంసలు కూడా లభించాయి. ప్రధానమంత్రిగా ఎన్నో సాహసమైన నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. పెద్ద కోట్ల రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, సైన్యంలో అగ్ని వీర్ ల నియామకం.. హైవేల నిర్మాణం.. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప నిర్ణయాలను నరేంద్ర మోడీ తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో సరికొత్త అభివృద్ధి చేపట్టారు. చీనాబ్ నది మీద ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసేలా వంతెన నిర్మించారు.. ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ దూసుకుపోతూనే ఉన్నారు.
2014లో భాగస్వామ్య పార్టీలతో అధికారాన్ని దక్కించుకున్న ఆయన.. 2019లో బిజెపిని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేలా చేశారు. 2024 లో భాగస్వామ్య పార్టీలతో అధికారులకు వచ్చారు. తనను పదేపదే విమర్శించే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ. కేవలం పరిపాలకుడిగానే కాకుండా.. ఒక సామాన్యుడిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. ఓకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా అనే నినాదాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. మన్ కి బాత్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. అందువల్లే నరేంద్ర మోడీ మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుగులేని నాయకుడిగా ఆదరణ సొంతం చేసుకుంటున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగిపోతున్నారు. అమెరికా లాంటి దేశం సుంకాలు విధిస్తున్నప్పటికీ .. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు నరేంద్ర మోడీ. ప్రత్యామ్నాయ విధానాలతో అనేక దేశాలను ఏకం చేసి అమెరికాకు చెక్ పెడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ ఎన్నో విజయాలు సాధించారు..