Sonali Phogat గోవా టూర్ కని వెళ్లిన బీజేపీ నాయకురాలు, బిగ్ బాస్ కంటెస్టెంట్, టిక్ టాక్ స్టార్ అయిన సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించారని బయటకు చెప్పారు. 41 ఏళ్ల వయసుకే ఆమె చనిపోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అయితే తాజాగా ఆమె మృతి కేసు అనూహ్య మలుపులు తిరిగింది. మొదట పోలీసులు, వైద్యులు గుండెపోటుగా భావించినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని అనుమానించారు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అనుమానంతో సోనాలి ఫోగట్ బాడీని పోస్టుమార్టంకు పంపారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. సోనాలి పోస్టుమార్టం నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ అంశాల ఆధారంగా గోవా పోలీసులు హత్యానేరం కేసు నమోదు చేశారు.
సోనాలి ఫోగట్ శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఇది హత్యగా అనుమానిస్తున్నారు. గోవాలో సోనాలి ఫోగట్ తోపాటు ఉన్న ఇద్దరు సన్నిహితులు సుధీర్ సగ్వాన్, సుఖ్ విందర్ వాసీలను నిందితులుగా చేరుస్తూ మర్డర్ కేసు నమోదు చేశారు.
-సోనాలీ ఫోగట్ ఎలా మరణించారు?
ఈనెల 22వ తేదీన గోవాకు వచ్చిన సోనాలి ఫోగట్ 23వ తేదీన ఆరోగ్యం క్షీణించడంతో గోవాలోని అంజునా ప్రాంతంలోని ఆస్పత్రిలో చేర్చారు. సోనాలి ఫోగట్ మృతి చెందడంతో గుండెపోటు కారణంగా ఆమె చనిపోయి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి గోవాకు చేరుకున్నారు. ఆమెది గుండెపోటు కాదని.. హత్య అంటూ ఆరోపించారు. సోనాలి సోదరుడు గోవా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ పోస్టుమార్టంలో సోనాలి శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోనాలి తోపాటు సుధీర్, సుఖ్ విందర్ లు ఉన్నారని.. వారితోనే తనకు ప్రమాదం ఉందని సోనాలి తన కుటుంబ సభ్యులకు ముందురోజు చెప్పినట్లు మృతురాలి సోదరుడు చెప్పాడు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్యకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
[…] Also Read: Sonali Phogat : సోనాలి ఫోగట్ పోస్టుమార్టం రిపో… […]