Singer Mythili Thakur: ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక అద్భుతం బయటపడుతూనే ఉంటుంది. ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈసారి బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అద్భుతం, సంచలనం కలిసి సంభ్రమాశ్చర్యం చోటుచేసుకుంది. అది బిజెపికి సరికొత్త శక్తిని ఇచ్చింది. అంతేకాదు రాజకీయాల్లోకి యువత వస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నిరూపించింది.
ఆమె పేరు మైథిలి. పేరుకు తగ్గట్టుగానే అత్యంత అందంగా ఉంటుంది. ఇక గొంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే గాన కోకిల సంభాషిస్తున్నట్టు ఉంటుంది. అటువంటి ఆ యువతి ఉన్నట్టుండి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అలాగని ఆమెకు బలమైన ఆర్థిక నేపథ్యం లేదు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ప్రొఫెషనల్ సింగర్. అద్భుతంగా పాటలు పాడుతుంది. ముఖ్యంగా రాముడు అంటే ఆమెకు ప్రాణం. రాముడి మీద ఎన్నో పాటలు పాడింది. కచేరీలు కూడా చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. పైగా రాముడి మీద ఫోక్ సాంగ్స్ కూడా రూపొందిస్తుంది. ఆమె గాత్రానికి.. పాడే విధానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భంగా మైథిలి అద్భుతమైన పాటలు పాడింది. ఆ పాటలు నరేంద్ర మోడీని విపరీతంగా ఆకర్షించాయి. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేసుకున్నారు. రాముడి గురించి మైథిలి పాడుతుంటే అద్భుతంగా ఉందని నరేంద్ర మోడీ రాసుకొచ్చారు.
ఇక బీహార్ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలి పోటీ చేశారు ఆర్జెడి అభ్యర్థి, సీనియర్ నాయకుడు వినోద్ మిశ్రాపై ఘనవిజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బిజెపి తరఫున నామినేషన్ వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాను పోటీ చేస్తానని మైథిలి ముందుకు వచ్చింది. అలీ నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసింది. ప్రత్యర్థి పై ఏమాత్రం విమర్శలు చేయకుండానే ఆమె ముందుకు వెళ్ళింది. అయితే ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన అలీ నగర్ ప్రాంత ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మిశ్రాకు విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. ఆయనను పక్కనపెట్టి మైథిలి ని గెలిపించుకున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుస్తుందని కమలం పార్టీ నాయకులకు ఏమాత్రం అంచనాలు లేవు. కానీ ఆ అంచనాలను నిజం చేసి చూపించింది మైథిలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన గాయనిగా పేరుపొందిన ఈమె.. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది.