https://oktelugu.com/

Indian Economy : పవర్‌ఫుల్‌ ఇండియా… శక్తివంతమైన 25 దేశాల్లో మూడో స్థానం..! 

తాజాగా ప్రపంచంలో శక్తివంతమైన 25 దేశాల్లో భారత్‌ 3వ స్థానానికి చేరుకుంది. మనకంటే ముందు ఇంకా అమెరికా, రష్యా మాత్రమే ఉన్నాయి.. 

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2023 / 03:06 PM IST
    Follow us on

    Indian Economy : సరిగ్గా ఏడాది క్రితం (ఆగస్టు 16, 2022) బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టి భారత్‌ 5వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కొనుగోలు శక్తి సమానత్వంలో, భారతదేశం యొక్క జీడీపీ 10.51 ట్రిలియన్లు, జపాన్, జర్మనీలను మించిపోయింది. అమెరికాకు చెందిన థింక్‌ ట్యాంక్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ నివేదిక ప్రకారం, 2019లో భారతదేశం యూకే, ఫ్రాన్స్‌ను అధిగమించింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2.94 ట్రిలియన్‌తో ప్రపంచంలో ఐదవ అతిపెద్దది అయిన యూకే, ఫ్రాన్స్‌లను భారత్‌ అధిగమించి ఐదవ స్థానానికి చేరుకుంది. అని అది పేర్కొంది. తాజాగా ప్రపంచంలో శక్తివంతమైన 25 దేశాల్లో భారత్‌ 3వ స్థానానికి చేరుకుంది. మనకంటే ముందు ఇంకా అమెరికా, రష్యా మాత్రమే ఉన్నాయి..

    ఇది మోదీ శకం.. 
    భారత స్వాతంత్య్రం ఆర్థిక చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. అయితే నాటి నుంచి నేటి వరకు పయనం సునాయాసంగా ఏమీ జరగలేదు. 1981, 1991లో ఆర్థిక సంక్షోభం, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం, డిమానిటైజేషన్‌ తదితరాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కరోనా మహమ్మారి, రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం వంటివి కూడా మనం చూశాం. అయితే ప్రధాని మోదీ స్పష్టమైన లక్ష్యంతో భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నారు.
    అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవల భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 8 నుంచి 8.5 శాతం మేరకు పెరగొచ్చని 2021–22 ఆర్థిక సర్వే ప్రొజెక్ట్‌ చేసింది. భారత తలసరి ఆదాయం సైతం స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి 500 రెట్లు పెరిగిందని తెలిపింది. మోదీ స్పష్టమైన లక్ష్యమే భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మొదటి విజయం.
    – ఇక రెండవ విజయం జీఎస్టీ నెలవారీ పన్ను వసూళ్లు 1.4–1.5 లక్షల కోట్లు దాటింది, మూడవ విజయం కొత్త సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌ను దాటి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది. నాలుగో విజయం 2017–18తో పోల్చితే భారత్‌లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలు పెరిగింది. దీంతో చైనా, అమెరికా కూడా ఆశ్చర్యపోయాయి. ఐదవ విజయం,  భారత జీడీపీ ఇతర దేశాలతో పోలిస్తే బాగా పెరిగింది. మన జీడీపీ 8.2, చైనా జీడీపీ 6.7 మరియు అమెరికా జీడీపీ 4.2 గా ఉంది.
    – ఆరో విజయం..
    నీరు, భూమి మరియు ఆకాశం నుంచి సూపర్‌సోనిక్‌ క్షిపణులను ప్రయోగించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. అమెరికా, రష్యా, చైనా వంటి దిగ్గజ దేశాలకే షాకిచ్చేలా రక్షణ రంగంలో విజయం సాధించింది.
    చాలెంజ్‌ చేసి పాకిస్థాన్‌ను పేదరికంలోని నెట్టి..
    70 ఏళ్లలో పాకిస్థాన్‌ని ఎప్పుడూ పేదరికంగా చూడలేదు. కానీ మోదీ వచ్చిన వెంటనే పాకిస్థాన్‌ దరిద్రంగా మారింది. పాకిస్థాన్‌ ఆదాయానికి మూలం భారతీయ నకిలీ నోట్ల వ్యాపారం. మోదీ దీనికి ముగింపు పలికారు. 2018లో చాలెంచ్‌ చేసి మరీ పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టారు. 2014లో కాంగ్రెస్‌ రక్షణ మంత్రి ఆంటోనీ మన దేశం పేదదని, చిన్న జెట్‌ని కూడా కొనలేమని పేర్కొన్నాడు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఇరాన్‌ రుణం తీర్చాడు,
    రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్మీకి బుల్లెట్‌ప్రూఫ్‌ స్కార్పియో రక్షణ కవచం లభించింది,
    జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీకి 2,500 బుల్లెట్‌ప్రూఫ్‌ స్కార్పియోలు అందించారు.
    మరిన్ని విజయాలు..
    ఆటో మార్కెట్‌లో జర్మనీని 4వ స్థానానికి పరిమితం చేసింది. విద్యుత్‌ ఉత్పత్తిలో రష్యాను 3వ స్థానంలో నిలిపివేసింది. టెక్స్‌టైల్‌ ఉత్పత్తిలో ఇటలీని వదిలిపెట్టి 2వ స్థానంలో నిలిచింది. మొబైల్‌ ఉత్పత్తిలో వియత్నాంను 2వ స్థానంలో నిలిపివేసింది. ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను దాటి 2వ స్థానంలో నిలిచింది.