PMFME Scheme: మీకు జాబ్ చేయడం ఇష్టం లేదా.. వ్యాపారం చేయాలన్న ఆసక్తి ఉందా.. ఏదైనా ఫుడ్ ప్రాజెసింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకే కేంద్రమే పెట్టుబడి సాయం అందిస్తుంది. మీ ఐడియాను కేంద్రానికి తెలియజేసి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇక మీరు తీసుకునే రుణంలో 35 శాతం వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. ఆ స్కీం ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
పీఎంఎఫ్‌ఎంఈ..
కేంద్రం ఫుడ్ ప్రాసెసింగ్ ఆధారిత వ్యాపారం చేయడానికి పీఎంఎఫ్‌ఎంఈ(ప్రధాన మంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాజెసింగ్ ఎంటర్ ప్రైజెస్) స్కీం తీసుకువచ్చింది. ఈ స్కీంలో భాగంగా ఎవరైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలనుకుంటున్నారో అలాంటి వారికి రూ.10 లక్షల రుణం ఇస్తుంది. ఇందులో 35 శాతం సబ్సిడీ కూడా వస్తుంది.
రూ.10 లక్షల ప్రాజెక్టు అయితే..
మీరు రూ.10 లక్షల ప్రాజెక్టు స్థాపించాలనుకుంటే అందులో 90 శాతం కేంద్రం రుణం మంజూరు చేస్తుంది. అంటే రూ.9 లక్షల రుణం వస్తుంది. అందులో 35 శాతం సబ్సిడీ ఉంటుంది. క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తే చివరలో 35 శాతం లోన్ అంటే రూ.3 లక్షలు కట్టాల్సిన పనిచేదు. మాఫీ అవుతుంది.
ఎలా అప్లైచేయాలి..
పీఎంఎఫ్‌ఎంఈ స్కీం కోసం http://pmfme.mofpi.gov.in/ వెంబ్‌సైట్ ద్వారా పథకానికి దర ఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. రుణం కూడా తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ రుణం అన్ని బిజినెస్‌లకు రాదు.
ఫుడ్ ప్రాజెక్టులకు మాత్రమే..
రూ.10 లక్షల రుణానిక కేంద్రం కేవలం ఫుడ్ ప్రాజెక్టులకు మాత్రమే ఇస్తుంది. బిస్కెట్ల తయారీ, జామ్ తయారీ, అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీ, మసాలా పౌడర్ల తయారీ, ఇలాంటి చిన్నచిన్న ప్రాజక్టులకు మాత్రమే కేంద్రం రుణం ఇస్తుంది.
ఇక ఆలస్యం చేయకండి వెంటనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని రుణం తీసుకుని మీ ఆలోచనలో ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయండి.