కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ను రైతుల కోసం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రెండేళ్ల క్రితం నుంచి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా డిసెంబర్ 1 నుంచి రైతుల ఖాతాల్లో ఏడో విడత నగదు జమ కానుంది. రైతులకు పంట పెట్టుబడి సాయంగా కేంద్రం ఈ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈ పథకం అమలు వల్ల దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిసున్న కోట్ల సంఖ్యలో కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ను దేశంలోని రైతులంతా ప్రశంసిస్తున్నారు. మూడు నెలల క్రితం రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ చేసిన కేంద్రం మళ్లీ మరో విడత నగదును ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమైంది. అయితే కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ కు అర్హులైనా కొందరి ఖాతాల్లో నగదు జమ కావడం లేదు.
అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ అమలుకు అర్హులైనా నగదు జమ కాకపోతే సమీపంలోని వ్యవసాయాధికారిని, జిల్లాలోని అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదించి నగదు ఎందుకు జమ కావడం లేదో తెలుసుకొని సమస్యను పరిష్కరించుకుని అర్హత పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్లను సైతం అందుబాటులో ఉంచింది. ఈ నంబర్లను ఫోన్ చేసినా స్కమస్య పరిష్కారమవుతుంది.
రైతులకు ఆన్ లైన్ గురించి అవగాహన ఉంటే పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి ఈ స్కీమ్ కు అర్హత సాధించొఛ్చు. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పొలం పట్టా ఉంటే కొత్తగా ఈ స్కీమ్ కోసం రైతులు పేర్లను నమోదు చేసుకోవచ్చు.