Operation Sindoor Effect: ఒకవైపు పాకిస్తాన్.. ఇంకోవైపు చైనా.. మరోవైపు బంగ్లాదేశ్.. ఇలా మూడు దేశాలు భారత్‌కు పక్కలో బల్లెంలా మారాయి. ఈ మూడింటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. స్థిరమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొదించింది. పొరుగు దేశాలతో నెలకొన్న ఉద్రిక్తతతల నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను రికార్డు స్థాయికి పెంచింది. ఆపరేషన్ సిందూర్ అనుభవాల ఆధారంగా అత్యాధునిక యుద్ధ వ్యూహాలకు భారీగా నిధులు వెచ్చించనుంది. మొత్తం బడ్జెట్‌లో 14.68% (రూ.7.85 లక్షల కోట్లు) రక్షణకు కేటాయించింది.
ఆధునికీకరణకు భారగా..
రక్షణ శాఖకు కేటాయించిన రూ.7.85 లక్షల కోట్లలో సింహ భాగం సైన్యం ఆధునికీకరణకు ఖర్చు చేయనుంది. అప్‌గ్రేడ్‌కు 21.84 శాతం కేటాయించింది. గతంలో రూ.1.8 లక్షల కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ.2.19 లక్షల కోట్లకు పెంచింది. ఇక వాయుసేన అవసరాలకు రూ.63,733 కోట్లు ఖర్చు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు, పింఛన్ల పెంపు
ఇక రోజువారీ కార్యకలాపాలకు కేటాయింపును కూడా కేంద్రం పెంచింది. వేతనాలు, ఇంధనం, రక్షణ నిర్వహణకు కేటాయించే నిధులను 17.24 శాతం పెంచింది. దీంతో దళాల సామర్థ్యం పెరుగుతుంది. ఇక పింఛన్లకు 6.53 శాతం(రూ.1.71 లక్షల కోట్లు) కేటాయించింది.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి..
ఇక ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి కేటాయించే ప్రత్యేకంగా నిధులు కూడా కేంద్రం పెంచింది. జమ్మూ–కాశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు రూ.255 కోట్లు (గతేడాది రూ.222 కోట్లు). స్పెషల్ ప్రాజెక్టులకు రూ.1,999.12 కోట్లు. వాయుసేన ప్రాజెక్టులకు రూ.1,618 కోట్లు కేటాయించింది.
ఆపరేషన్ సిందూర్ విజయం ఆధారంగా భద్రత, అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్‌కు బ్యాలెన్స్‌డ్‌గా ఈసారి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు కేంద్రం తెలిపింది.