
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ఆరుగురిలో వైరస్ ఉన్నట్లు తాజాగా తేలింది. ఈ ఆరుగురిలో ముగ్గురు ఏపీ, తెలంగాణ వాళ్లే ఉన్నారట. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: కరోనా రోగులకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్య ఉంటే ప్రాణాలకే ముప్పు..?
హైదరాబాద్‌లో ఇద్దరికి నిర్ధారణ అయింది. వీరి నుచి ఇంకెవరికైనా సోకినట్లుగా తేలలేదు. ఈ ఆరుగురి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులును ట్రేసింగ్ చేస్తున్నారు. కొత్త రకం వైరస్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. ఈ కొత్త రకం వైరస్ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా కరోనా వైరస్ కావడంతో లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read: భారత్ లో కొత్త కరోనా కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?
అయితే.. వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. రేపోమాపో.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యాక్సిన్.. కొత్త రకానికి కూడా పనిచేస్తుందని కేంద్రం ప్రకటించింది. కొత్త రకం స్ట్రెయిన్ ప్రభావంపై పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ విస్తృత వ్యాప్తి మాత్రమే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అంతేకాదు.. నిన్న తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త వైరస్ స్ట్రెయిన్‌తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ధీమాగా చెప్పారు. కానీ.. స్పీడ్‌గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటిలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.