PM Modi: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ.. బీజేపీకి సోషల్ మీడియా ద్వారా ఒక రేంజ్‌లో హైప్ తీసుకు వర్చారు. ఇక మోదీ తన పర్సనల్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో నిత్యం మెజేస్‌లను షేర్ చేస్తూ ఉంటారు. ఎక్స్ ఖాతాకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక తన తాజాగా యూట్యూబ్ చానెల్ ద్వారా రెండు కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ను పొంది తాజాగా మరో రికార్డు సాధించారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన లీడర్‌గా రికార్డు సృష్టించారు. మోదీ యూట్యూబ్ వీడియోలకు ఇప్పటి వరకు 450 కోట్ల వ్యూస్ కూడా ఉన్నాయి.
లైవ్ కార్యక్రమాలు..
మోదీ తన యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు, లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో మోదీ చానెల్‌కు ఏటా సబ్‌స్క్రైబర్లు పెరుగుతూ వస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2007లో ఈ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశారు. 2019లో ఆయన కాశీ పర్యటన సమయంలో దివ్యాంగులు మోదీకి స్వాగతం చెప్పిన వీడియోను మోదీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని అత్యధిక మంది వీక్షించారు. తర్వాత ఇస్ట్రో చైర్మన్ శివన్ చంద్రయాన్ –2 విఫలమైనప్పుడు భావోద్వేగానికిలోనయ్యారు. అప్పుడు మోదీ ఆయనన ఓదార్చారు. ఈ వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని కూడా ఎక్కువ మంది వీక్షించారు. తర్వాత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూ వీడియో కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు వీక్షించారు.
ప్రతీ విషయం యూట్యూబ్ ద్వారా..
మోదీ ప్రధానిగా తాను చెప్పాలనుకున్న ఏ విషయాన్నైనా యూట్యూబ్ చానెల్ ద్వారా చెబుతారు. విలువైన సమాచారాన్ని కూడా యూట్యూబ్‌లో షేర్ చేస్తారు. దీంతో చాలా మంది దీనిని సబ్‌స్క్రైబ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోమైలురాయిని అధిగమించారు. ఇటీవల తన యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని దేశ ప్రజలకు విన్నవించారు. అప్‌డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కాలని మోదీ స్వయంగా కోరడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఫలితంగా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లలో చరిత్ర సృష్టించారు.