దేశంలోనే అపర కుబేరుడిగా మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన సంపాదన కళ్లు చెదిరేలా ఉంది. ఏకంగా గంటకు రూ.90కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ మేరకు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్’ ఇండియా అంబానీ ఘనతను మరోసారి చాటి చెప్పింది.
Also Read: నేడే బాబ్రీ కేసు తీర్పు: అద్వానీ, జోషి, ఉమాభారతిల్లో వణుకు..
‘ఐఐఎఫ్ఎల్’ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో వరుసగా 9వ సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాను ‘హురున్ రిచ్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు. ఇక భారత్ లోని నంబర్ 1 కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం అంబానీ సంపద రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. రెండో స్థానంలో హిందుజా సోదరులు ఉండగా.. మూడో స్థానంలో శివ్ నాడార్ కుటుంబం ఉంది.
ఇక 1000 కోట్లకు మించిన సంపద ఉన్న 828 మందిని ఐఐఎఫ్ఎల్ పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే దేశంలోనే అంబానీ నంబర్ 1 స్థానంలో నిలిచారు.
Also Read: ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక అసలు నిజమిది?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ భారత్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆగస్టు 31తో గడిచిన 12 నెలల కాలంలో అంబానీ ఆసక్తి 73శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ పేర్కొంది.