https://oktelugu.com/

Mosquitoes : విమానం వెళ్లకుండా అడ్డుకున్న దోమలు..

కేవలం దోమల కారణంగా విమానాలు కూడా ఆగుతాయా? అని అనుకుంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2023 / 04:03 PM IST
    Follow us on

    Mosquitoes : జీవితంలో ఒక్కసారైన ఫ్లైట్ ఎక్కాలని చాలా మంది కోరుకుంటారు. ఈ ఆలోచనల నేపథ్యంలో ఇటీవల ఓ సినిమా కూడా వచ్చింది. అయితే కొందరు వ్యాపారం, విదేశాలకు వెళ్లేవారు తరుచూ విమానాలు ఎక్కుతుంటారు. దేశీయంగా దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు సైతం లోకల్ ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు అనేక సాంకేతిక ఇబ్బందులు తరుచూ కనిపిస్తుంటాయి. వీటికి ప్రత్యేకంగా సిబ్బంది రెడీగా ఉండి అప్పటికప్పుడు సెట్ చేస్తారు. లేదా వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తారు. ఈ క్రమంలో సమయాని వెళ్లాల్సిన విమానం ఆలస్యం అవుతుంది. కానీ కొన్ని దోమల వల్ల ఓ విమానం ఆలస్యంగా ప్రయాణించింది. ఇంతకీ అవేం చేశాయంటే?

    ప్రపంచంలో ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దానిని వెంటనే క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ వింత సంఘటనను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కొన్ని దోమల కారణంగా విమానం ఆగిపోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు దోమలు విమానాన్ని ఎలా ఆపాయంటే?

    మెక్సికోలోని ఒలారీస్ ఫ్లైట్ గువ్వాడలహర నుంచి మెక్సికో సిటీకి ఉదయం 4.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ ఫ్లైట్ బయలుదేరే సమయానికి ఒక్కసారిగా విమానంలోకి దోమలగుంపు వచ్చింది. దీంతో ఫ్లైట్ లోని ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాసేపు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. దీంతో విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్ప్రేలు కొట్టడం ప్రారంభించారు. ఇలా దోమల కారణంగా మూడు గంటల పాటు ఫ్లైట్ ఆగిపోయింది.

    ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అక్టోబర్ 6న జరిగిన ఈ సంఘటన బయటకు రాలేదు. ఆలస్యంగానైనా ప్రపంచానికి తెలియడంతో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కేవలం దోమల కారణంగా విమానాలు కూడా ఆగుతాయా? అని అనుకుంటున్నారు.