మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.3 లక్షలు వేస్తున్న మోదీ.. నిజమేనా..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రజల్లో చాలామంది పనికి తగిన వేతనం లభించక, పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే గత కొన్ని […]

Written By: Kusuma Aggunna, Updated On : November 20, 2020 6:20 pm
Follow us on


కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రజల్లో చాలామంది పనికి తగిన వేతనం లభించక, పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల బ్యాంకు ఖాతాలలో మూడు లక్షల రూపాయలు జమ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రధాని మోదీ మహిళల ఖాతాలో డబ్బు జమ చేయడం లేదు. దేశంలో అలా డబ్బులు జమ చేస్తున్న స్కీమ్ కూడా లేదు. కేంద్రం అమలు చేయకపోయినా కొందరు ఫేక్ స్కీమ్స్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ప్రజల్లో చాలామంది ఈ ఫేక్ స్కీమ్స్ నిజంగా అమలవుతున్నాయని నమ్మి నష్టపోతున్నారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించి స్పష్టతనిచ్చింది. మోదీ రూ. 3 లక్షలు జమ చేస్తున్నట్టు వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని తెలిపింది. ప్రధాన్ మంత్రి క్రెడిట్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ అమలవుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది.

ఫేక్ స్కీమ్స్ విషయంలో ప్రజలు పూర్తి అవగాహన ఏర్పరచుకుని జాగ్రత్త వహించాలి. కొందరు మోసగాళ్లు ఫేక్ స్కీమ్స్ ను అడ్డం పెట్టుకుని ఈ స్కీమ్స్ సహాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, స్కీమ్ ల విషయంలో నిజానిజాలు నిర్ధారించుకుంటే మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.