Life Imprisonment For Dogs: కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రాంతంలో సంబంధం లేకుండా కుక్క కాట్లు ఎక్కువవుతున్నాయి. దీని వెనుక కారణాలు ఎలాంటివి ఉన్నప్పటికీ అంతిమంగా మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భాలలో కుక్కకాట్ల కేసులకు ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉండకపోవడంతో ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కల నియంత్రణకు ప్రభుత్వాలు నడుంబిగించాయి. అయితే ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా చర్యలు తీసుకుంటున్నది.
దేశంలో శునకాలు విపరీతంగా సంచరిస్తున్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది. ఈ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద ప్రాంతం కాబట్టి ఇక్కడ కుక్కలను నియంత్రించడం అధికార యంత్రాంగానికి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కుక్కల నియంత్రణకు సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. వీధి కుక్కలను నియంత్రించడానికి నిర్మించింది. ఒక మనిషిని ఒక కుక్క మొదటిసారి కరిస్తే 10 రోజులపాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచుతారు. టీకాలు వేసి.. దాని శరీరంలో మైక్రో చిప్ అమర్చుతారు. ఆ తర్వాత దానిని విడుదల చేస్తారు. అదే కుక్క రెండోసారి కరిస్తే.. దానిని అదే కేంద్రంలో జీవితాంతం ఉంచే విధంగా ఏర్పాటు చేస్తారు.. కుక్క కాట్ల నిరోధానికి శాఖ పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎస్ పీ సీ ఏ సభ్యుల కమిటీ చొరవ చూపుతుంది. ఒకవేళ కుక్క కరిచినట్టు పూర్తి ఆధారాలు గనుక లభిస్తే దానికి జీవిత కాలం పాటు ఖైదు విధిస్తారు.
కుక్కలకు జీవిత ఖైదు విధించిన ప్రభుత్వంగా ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో కుక్కల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆమోదం లభిస్తోంది. కుక్క కాట్లను నిరోధించడం వల్ల రేబిస్ కేసులు తగ్గిపోతాయని.. మరణాలు కూడా తగ్గిపోతాయని ఉత్తరప్రదేశ్ అధికారులు భావిస్తున్నారు. మాంసాహార దుకాణాలలో కుక్కల బెడద అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మాంసాహార దుకాణాలలో మిగిలిపోయిన వ్యర్ధాలను కుక్కలకు వేయడం వల్ల అవి మనుషులను కరుస్తున్నాయని అధికారుల దర్యాప్తులో తేలింది. మాంసాహార దుకాణాలను దూరంగా ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.