
Kerala Wedding Twist: వారంలో పెళ్లి జరగనుంది. ఇళ్లంతా సందడిగా మారింది. బంధువులు వస్తున్నారు. కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులతో ఇళ్లంతా సందడిగా మారింది. అందరు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఓ కుర్రాడు దిగి ఇళ్లంతా తేరిపారా చూశాడు. ఎవరి పనుల్లో వారు ఉన్నారని తెలుసుకుని మెల్లగా ఇంట్లోకి ప్రవేశించాడు. అందరితో కలివిడిగా మాట కలిపాడు. కేరళలోని తిరువల్లలో జరిగిన సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.
బంధువులబ్బాయి కావడంతో చిన్న చిన్న పనులు పురమాయించారు. దీంతో అందరితో పరిచయం పెంచుకున్న అతడు సమయం కోసం ఎదురుచూశాడు. వధువు చెల్లెలు నగలు కొనుక్కుంటానని వెళ్లేందుకు అతడితో సిద్ధమైంది. కానీ ఇంతలో అంత దూరం ఎలా వెళతావు అని వధువు వారించింది. పైగా స్కూటీ రిపేరులో ఉందని చెప్పడంతో అక్కా తను ఉన్నాడు కదా అని చెప్పింది. ఇంతలో వధువు తల్లి నేనూ వస్తాలే అని వారితో వెళ్లేందుకు సిద్ధమైంది.
దీంతో ఆ కుర్రాడు వధువు చెల్లి, తల్లిని కారులో తీసుకుని మార్కెట్ కు వెళ్లాడు. తరువాత తనకు పని ఉందంటూ కారులో వెళ్లిపోయాడు. అనంతరం చెల్లి రోడ్డు అవతల కంప్యూటర్ కేఫ్ లో పని ఉందంటూ వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో తనకు అర్థమైపోయింది. తన కూతురు ఆ కుర్రాడితో వెళ్లిపోయిందని ఆలస్యంగా తెలుసుకుంది. దీంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది.
కంప్యూటర్ కేఫ్ కు మరో దారి వెనుక నుంచి ఉంది. దీంతో ఆమె ఆ దారి గుండా పరారయినట్లు తెలుస్తోంది. తరువాత ఇద్దరి ఫోన్లు స్విచాప్ వచ్చాయి. పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించి కంగుతిన్నారు. కుర్రాడు అటు వైపు నుంచి కారులో ఎదురు చూసినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వారిద్దరు మేజర్లు కావడంతో ఇక ఏం చేయలేమని చెప్పినట్లు తెలిసింది.