https://oktelugu.com/

జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వాయిస్ కాల్స్..?

దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో ఉచిత వాయిస్ కాల్స్ ను అందించిన జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ ను అందించటానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం జియో నుంచి జియోకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ ఉండగా ఇతర నెట్వర్క్ లకు కాల్స్ పై పరిమితులు ఉన్నాయి. అయితే జియో ఆ పరిమితులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై జియో కస్టమర్లకు డేటాకు మాత్రమే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2020 / 06:10 PM IST
    Follow us on


    దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో ఉచిత వాయిస్ కాల్స్ ను అందించిన జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ ను అందించటానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం జియో నుంచి జియోకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ ఉండగా ఇతర నెట్వర్క్ లకు కాల్స్ పై పరిమితులు ఉన్నాయి. అయితే జియో ఆ పరిమితులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై జియో కస్టమర్లకు డేటాకు మాత్రమే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు.. ఎలా పొందాలంటే..?

    గత కొంతకాలం ఎయిర్ టెల్ నుంచి పోటీ ఎదురవుతూ ఉండటం, కొత్త కనెక్షన్ల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో జియో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. జియో తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటినుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఛార్జీలను రద్దు చేయడం గురించి జియో స్పందిస్తూ ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు రద్దైన తరువాత వాయిస్ కాల్స్ కు ఛార్జీలను రద్దు చేస్తామని గతంలో చెప్పామని ఆ హామీ ప్రకారం ఇప్పుడు నిబంధనలను ఎత్తివేశామనితెలిపారు.

    Also Read: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్… పరీక్షలు ఎప్పుడంటే..?

    ఈరోజుతో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీల గడువు ముగియనుండటంతో జియో మళ్లీ ఫ్రీగా వాయిస్ కాల్స్ ను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జియో కంపెనీ టెలీకాం రెగ్యులేటరీ ఆదేశాల ప్రకారం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మరోవైపు జియో కంపెనీ ఐయూసీ ఛార్జీలను తొలగించడంతో ఆ ప్రభావం ఇతర నెట్వర్క్ లపై పడనుందని తెలుస్తోంది. జియో తీసుకున్న నిర్ణయం వల్ల జియోతో పాటు ఇకపై ఇతర నెట్వర్క్ లకు కూడా ఉచితంగా వాయిస్ కాల్స్ అందుబాటులోకి రానున్నాయి.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    కొత్త సంవత్సరం వస్తున్న సమయంలో జియో చెప్పిన గుడ్ న్యూస్ వల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రస్తుతం జియో పరిమితంగా మాత్రమే 1000 నిమిషాలు, 2000 నిమిషాలు, 3000 నిమిషాల చొప్పున ఇతర నెట్వర్క్ లకు వాయిస్ కాల్స్ ఇస్తుండగా ఇకపై ఇతర నెట్వర్క్ లకు కూడా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.