3D Moon: పున్నమి వేళల్లో చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. చల్లని వెన్నెల కురిపిస్తూ మై మరపింప చేస్తాడు. లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తన అందంతో సమ్మోహనులను చేస్తాడు. అలాంటి చందమామను మనం ఎప్పుడైనా త్రీడీ లో చూస్తాం అనుకున్నామా? అక్కడ నీటిజాడలు ఉంటాయని అనుకున్నామా? సల్ఫర్ నిల్వలు ఉంటాయని కలగన్నామా? ఇవన్నీ ఇస్రో చెబితేనే మనకు తెలిసింది.. మనకే కాదు అమెరికా లాంటి తోపు దేశానికి కూడా ఇస్రో చెబితేనే తెలిసింది.
చంద్రుడికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఇస్రో చంద్రయాన్_3 అనే ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రయాన్_2 వల్ల జరిగిన వైఫల్యాలను సరిదిద్దుకొని ఈ ప్రయోగాన్ని మరింత పకడ్బందీగా చేపట్టింది. ఇస్రో అనుకున్న విధంగానే చంద్రయాన్_3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదికి విక్రమ్ ల్యాండర్ అనుకున్న విధంగా దిగింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఇస్రో చెప్పినట్టుగానే పనిచేస్తోంది. చంద్రుడిపై సల్ఫర్ ఆనవాళ్లను
ప్రజ్ఞాన్ రోవరే గుర్తించింది. చంద్రుడిని దానిపై ఉన్న వస్తువులను 3d రూపం లో చూసేందుకు ప్రజ్ఞాన్ రోవర్ ప్రత్యేక అనాగ్లీఫ్ పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ చిత్రాలను ఇస్రో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ ద్వారా పంచుకుంది.. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన “నావ్ కామ్” అనే సాంకేతికతను ఉపయోగించి రోవర్ “అనా గ్లిఫ్” అనే చిత్రాన్ని రూపొందించింది.
అనా గ్లిఫ్ అంటే ఏంటంటే..
అనా గ్లిఫ్ అనేది స్టీరియో లేదా మల్టీ వ్యూ చిత్రాల నుంచి మూడు కోణాల్లో వస్తువులను లేదా భూభాగాల సరళికృత వీక్షణ. ఇస్రో పోస్ట్ చేసిన అనాగ్లిఫ్.. ప్రజ్ఞాన్ రోవర్ సేకరించిన ఎడమ, కుడి చిత్రాలతో సహా నావ్ కామ్ స్టీరియో చిత్రాలను ఉపయోగించి సృష్టించామని ఇస్రో పేర్కొంది. త్రీడీ ఫోటోలో చంద్రుడి ఎడమ వైపు ఎరుపు చానెల్ లో ఉందని, కుడి చిత్రం నీలం, ఆకుపచ్చ ( సియాన్ రంగు) చానల్ లో ఉందని ఇస్రో అభిప్రాయపడింది. ఈ రెండు చిత్రాల మధ్య దృక్కోణంలో వ్యత్యాసం స్టీరియో ప్రభావాన్ని సూచిస్తోందని ఇస్రో వివరించింది. ఈ మూడు కోణాల దృశ్య ప్రభావాన్ని 3డి చిత్రంలో స్పష్టంగా చూడవచ్చని ఇస్రో పేర్కొంది. చందమామ 3d చిత్రాన్ని చూడాలి అంటే ఎరుపు లేదా సియాన్ రంగు ఉన్న కళ్ళద్ధాలు ధరించి చూడాలని ఇస్రో పేర్కొంది
ఇక విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై హోప్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీనిని ఇస్రో మళ్లీ విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ లాగా అభివర్ణించింది. చంద్రయాన్ పే లోడ్ లు ప్రస్తుతానికి అత్యంత నిష్క్రియ గా మారాయని ఇస్రో వివరించింది. ఈ పరీక్ష భవిష్యత్తులో చంద్రుడి మిషన్లలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్_3 మిషన్ లోని విక్రం ల్యాండర్ భారత కాలమాన ప్రకారం ఉదయం 8 గంటలకు హేబర్నేషన్ మోడ్ లోకి వెళ్ళింది.
ఇస్రో చెబుతున్న దాని ప్రకారం.. సౌర శక్తి అయిపోయిన తర్వాత బ్యాటరీ శక్తిని పొందడం ఆగిపోయిన తర్వాత.. విక్రమ్ ప్రజ్ఞాన్ రోవర్ దగ్గర నిష్క్రియ స్థితిలోకి వెళ్ళింది.. విక్రమ్ ల్యాండర్ ను సెప్టెంబర్ 22 నాడు ఆక్టివేట్ చేస్తారని తెలుస్తోంది.. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం మీద చంద్రయాన్_3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత భారతదేశం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితల మీదికి చేరుకున్న నాలుగవ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపిన దేశంగా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
Chandrayaan-3 Mission:
Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images.
The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA
— ISRO (@isro) September 5, 2023