Southwest Monsoon: మండే ఎండలు.. వానమ్మ జాడేది? నైరుతి రాకపై షాకింగ్ న్యూస్

నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ఇంకా తాకకపోవడంతో భారత వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు కేరళ తాకపోవడం పట్ల

Written By: Rocky, Updated On : June 6, 2023 4:06 pm

Southwest Monsoon

Follow us on

Southwest Monsoon: రోహిణి కార్తె సగానికి వచ్చింది. మే నెలను మరిపిస్తూ ఎండ దంచి కొడుతోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తోంది. నగరం, గ్రామం అని తేడా లేకుండా 46కు మించి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఏడాది ఎల్ నీనో ముప్పు ఉంటుంది అని భారత వాతావరణ శాఖ చెప్పినట్టే జరుగుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించ పోవడం ఆ పరిస్థితిని ధ్రువపరుస్తోంది. వాస్తవానికి జూన్ 4నే కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాలి. అక్కడి నుంచి అవి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మన దేశంలోని సుమారు 90 శాతం వ్యవసాయానికి ఈ నైరుతి రుతుపవనాలే ఆధారం.

వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారంటే

నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ఇంకా తాకకపోవడంతో భారత వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు కేరళ తాకపోవడం పట్ల వారు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. పడమటి గాలుల లోతు కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జూన్ 4 నాటికి సముద్రమట్టానికి వాటి విస్తీర్ణం 2.1 కిలోమీటర్లకు చేరుకుందని, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాలు కేరళను తాకే పరిస్థితులు మెరుగయ్యాయని వారు చెబుతున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిభవనాలు ఇంకా కేరళ రాష్ట్రాన్ని తాకలేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలో ప్రవేశిస్తే.. అది మొత్తం వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి అలా ఉంటుందా

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మంచి వర్షపాతం నమోదు అవుతోంది. ఫలితంగా కొత్త ఆయకట్టు కూడా సాగులోకి వచ్చింది. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వారు హెచ్చరికలు చేసినట్టుగానే ఈ ఏడాది నిర్ణీత సమయంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకలేదు. దీనికి తోడు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న నేపథ్యంలో రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. మనదేశంలో మెజారిటీ వ్యవసాయం రుతుపవనాల మీద ఆధారపడి ఉందని, అవి ఈ ఏడాది పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల ముఖం చాటేస్తే కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.