Homeజాతీయ వార్తలుJack Dorsey- Modi: మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ సీఈవో చేసిన ఆరోపణల్లో నిజమెంత?

Jack Dorsey- Modi: మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ సీఈవో చేసిన ఆరోపణల్లో నిజమెంత?

Jack Dorsey- Modi: నూతన వ్యవసాయ చట్టాలపై అప్పట్లో ఢిల్లీలో జరిగిన ఆందోళనలు గుర్తున్నాయి కదా! రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు చర్చనీయాంశంగా మారాయి. అప్పట్లో ఆ ఉద్యమం చేసే వారందరికీ ట్విట్టర్ వేదికగా మద్దతు లభించింది. ఇదే సమయంలో ట్విట్టర్ టూల్ కిట్ ద్వారా దేశం మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారని అప్పట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు ఈ రైతు ఉద్యమం పేరుతో ఖలిస్థానీ జెండాలు ఎగరవేస్తున్నారని విమర్శించారు. దీంతో కేంద్రం వెనకడుగు వేసింది. ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ఆ ఉద్యమం ఆగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ ఉద్యమం జరిగినప్పుడు తమ కంపెనీ ని మూసివేస్తామని భారత్ నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఆరోపించారు. రైతు నిరసన నేపథ్యంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ప్రభుత్వం తమని ఒత్తిడికి గురి చేసిందని విమర్శించారు.

సంచలన ఆరోపణలు

భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. రైతు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఎకౌంట్లోను బ్లాక్ చేయాలని ట్విట్టర్ కు అనేకమార్లు అభ్యర్థనలు అందినట్టు వివరించారు. విషయంపై భారత ప్రభుత్వం తమను ఒత్తిడికి గురి చేసిందని డోర్సే అభిప్రాయపడ్డారు. అవసరమైతే సామాజిక మాధ్యమాన్ని నిషేధిస్తామని కూడా బెదిరించినట్టు ఆయన పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

అన్నీ అబద్ధాలే

అయితే జాక్ డోర్సే ఆరోపణలు చేసిన నేపథ్యంలో సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజు చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తి నిరాధారమని కొట్టి పారేశారు. ట్విట్టర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకు పంపలేదని స్పష్టం చేశారు.. అంతే కాకుండా డోర్సే, అతడి బృందం పదేపదే భారతదేశ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. 2020 నుంచి 2022 వరకు ఇదే పద్ధతిని పాటించిందని చెప్పుకొచ్చారు..” జాక్ డోర్సే భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించేందుకు సుముఖత చూపలేదు. చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించినట్టు ఆయన ప్రవర్తించారు. అంతేకాక దేశంలో ఉన్న కంపెనీలను చట్టాలు పాటించకుండా చేశారు.. రైతుల నిరసనను డోర్సే ఎందుకు ప్రస్తావించారో అందరికీ తెలుసని” రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.

తప్పుడు సమాచారం వ్యాప్తిలోకి..

రైతు ఉద్యమ సందర్భంగా చాలా తప్పుడు సమాచారం వ్యాప్తిలోకి వచ్చిందని, అప్పుడు దానిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. తప్పుడు వార్తలు సమాజానికి చేటు తెస్తే దాని నష్టం ఎలా ఉంటుందో ట్విట్టర్ కు ఎలా తెలుస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. డోర్సీ ఆధ్వర్యంలో ట్యూటర్ కేవలం భారతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ని కూడా ఏకపక్షంగా పక్కన పెట్టిందని ఆరోపించారు. తప్పుడు సమాచారాన్ని ఆయుధాలుగా చేయడంలో ట్విట్టర్ అప్పుడు సహాయం చేసిందని ఆరోపించారు. భారత ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉన్నాయని, వివిధ సంస్థలు కూడా విశ్వసనీయంగా, జవాబుదారీదనంగా ఉండాలని రాజీవ్ చంద్రశేఖర్ కోరారు. అంతే కాదు గతంలో బీబీసీ మీద దాడి చేసినప్పుడు, ఆ సంస్థ కూడా ఇలాంటి విష ప్రచారం చేసిందని రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular