Holi : అక్కడి ఆడవాళ్లకు హోలీ నాడు మగాళ్లు దొరికితే చాలు.. దుస్తులు చించేసి.. ఆ పని చేస్తారు

సోమవారం ఉదయం 10 : 23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు. ఈ చంద్రగ్రహణం కొనసాగింది. అయితే ఈ చంద్రగ్రహణం మనదేశంలో కనిపించలేదు. దీనిని సూతక్ కాలం అని జ్యోతిష్యులు ప్రకటించారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలి నాడు చంద్రగ్రహణం ఏర్పడిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : March 25, 2024 5:26 pm

Barsana holi

Follow us on

Holi : మనదేశంలో అతి ముఖ్యమైన పండుగలు హోలీ ఒకటి. రంగులు చల్లుకుంటూ.. కేరింతల కొడుతూ.. ఈ పండుగను జరుపుకుంటారు. అన్ని వయసులవారు ఈ పండుగను ఎంజాయ్ చేస్తారు. అయితే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన మనదేశంలో హోలీ పండుగను ప్రజలు ఒక్కోచోట ఒక్క విధంగా జరుపుకుంటారు.

హిందూ ధర్మంలో ప్రతి పండుగ వెనుక చారిత్రక ఐతిహ్యం ఉంటుంది. ప్రతి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని వెనుక అనేక ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. హోలీ కూడా అటువంటిదే. హోలీ కేవలం రంగుల వేడుక మాత్రమే కాదు. హోలీ అనేది పెద్దల నుంచి ఆశీర్వాదాలు.. దేవుళ్ళ నుంచి ఆశీస్సులు.. అందుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటారు.

అయితే ఈ హోలీ పండుగను మన దేశంలోని బర్సాన అనే ప్రాంతంలో విచిత్రంగా జరుపుకుంటారు. ఇక్కడ హోలీ రోజున రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే ఆట ఆడుతారు. ఈ ఆటలో భాగంగా వేలాది మంది స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. అయితే ఆ దెబ్బలు తినకుండా పురుషులు డాలు లేదా షీల్డ్ లతో వారిని వారు రక్షించుకుంటారు. మహిళలు హోలీ పాటలు పాడుకుంటూ పురుషులను కొట్టేందుకు వస్తుంటారు. వారి వ్యవహారిక భాషయిన బ్రజ్ లో హోలీ పాటలు పాడుతుంటారు.

ఇక ఈ గ్రామం పక్కనే నందగావ్ అనే గ్రామం ఉంటుంది. నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలు పెద్ద పెద్ద కర్రలతో ఎదురుచూస్తుంటారు. పురుషులు ఆ గ్రామంలోకి ప్రవేశించగానే మహిళలు ఆ కర్రలతో కొడుతుంటారు. రంగుల చల్లుతూ సందడి చేస్తారు. అయితే ఈ సాంప్రదాయ వెనుక పెద్ద చరిత్ర ఉంది. పురాణ కాలంలో శ్రీకృష్ణుడు గోపికల మధ్య ఇలాంటి వేడుకలే జరిగేవని.. వాటికి ప్రతీకగా ఈ కాలంలోనూ జరుపుకుంటున్నామని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు. హోలీ సందర్భంగా బర్సాన లో జరిగే వేడుకలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తుంటారు. ఈ సందర్భంగా అక్కడ గ్రామ పెద్దలు చిన్న చిన్న యుద్ద పోటీలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇక మధురలోని దౌజి గ్రామంలో హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పురుషులు, స్త్రీలు పరస్పరం రంగులు చదువుకుంటారు. స్త్రీలు మగాళ్లు కనిపిస్తే చాలు.. వారి దుస్తులు చింపేస్తారు. వారిపై రంగులు చల్లి.. నీళ్లు కుమ్మరిస్తారు. ఎవరు ఎంత తొందరలో ఒక పురుషుడి దుస్తులు చింపితే.. వారిని విజేతగా ప్రకటించి బహుమతులు అందజేస్తారు. ఇక ఉత్తర భారత దేశంలో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి నాటి రాత్రి హోలి కా దహన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు హోలీ నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది హోలీ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడింది. సోమవారం ఉదయం 10 : 23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు. ఈ చంద్రగ్రహణం కొనసాగింది. అయితే ఈ చంద్రగ్రహణం మనదేశంలో కనిపించలేదు. దీనిని సూతక్ కాలం అని జ్యోతిష్యులు ప్రకటించారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలి నాడు చంద్రగ్రహణం ఏర్పడిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.