కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢీల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. గత 18 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనపై ప్రభుత్వం లైట్ గా తీసుకుంటోంది. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే కొన్ని సవరణలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.
Also Read: ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..?
ఈ చర్చలపై రైతులు సంత్రుప్తి పడలేదు. దీంతో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం తమ పట్టును వీడడం లేదు. దీంతో రైతులు ఉద్యమాన్ని ఉధ్రుతం చేసేలా డెడ్ లైన్ ను విధించారు. ఈనెల 19 లోగా కేంద్రం వ్యవసాయ చట్టంపై నిర్ణయం తీసుకోవాలని లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గత 18 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో చలిని సైతం లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు. ఈనెల 8న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన రైతులు అదే రోజు అమిత్ షా తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో మరుసటి రోజు నుంచి ఆందోళనను మరింత ఉధ్రుతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా తమ కార్యచరణాన్ని ప్రకటించారు.
Also Read: బీజేపీ వర్సెస్ జనసేన..!
కార్యాచరణలో భాగంగా శనివారం జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టారు. ఢిల్లీ-జయపుర జాతీయ రహదారిని దిగ్బంధించారు. హర్యానాలోని టోల్ ప్లాజా వద్ద రైతుల ధర్నా చేశారు. వాహన సుంకాలు వసూలు చేయకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. ఇక ఆదివారం ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజస్థాన్ లోని షాజహాన్ పుర్ నుంచి ఢిల్లీ -జయపుర రహదారి మీదుగా వేలాది సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై యాత్ర చేపట్టనున్నట్లు రైతులు తెలిపారు.
అలాగే ఈనెల 19లోగా ప్రభుత్వం వ్యవసాయ చట్టంపై నిర్ణయం తీసుకోకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంటున్నారు. కాగా రైతుల కుటుంబ సభ్యులుసైతం ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్