https://oktelugu.com/

Karnataka Exit Polls Predict : హంగ్ లేదంటే హస్తం.. కర్ణాటకలో ‘చేతులు’ మారనున్న ప్రభుత్వం

ఎగ్జిట్ పోల్స్ కూడా ఉండడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే హంగ్ లేదంటే హస్తం గా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2023 / 07:51 PM IST
    Follow us on

    Karnataka Exit Polls Predict : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికారం చేతులు మారే అవకాశం కనిపిస్తోంది. బుధవారం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కడపటి వార్తలు సమయం వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం ఎండ అధికంగా ఉండడంతో సాయంత్రం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం వరకు 54 శాతం వరకు నమోదైన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది.

    -ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెబుతున్నాయంటే

    కర్ణాటక రాష్ట్రంలో ఈసారి అధికారం మారే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సాయంత్రం 6 గంటల తర్వాత తొలి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చేసింది. మరో మారు అధికార పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించదని స్పష్టం చేసింది. పీపుల్స్ పల్స్ చేసిన సర్వేలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి 107 నుంచి 119 వరకు సీటు రావచ్చని అంచనా వేసింది. ఇక అధికార భారతీయ జనతా పార్టీకి 70 నుంచి 90 వరకు స్థానం రావచ్చని లెక్క కట్టింది. జెడిఎస్ కు 23 నుంచి 29 వరకు స్థానాలు రావచ్చని వివరించింది.

    మొదటి నుంచి ఓటర్ అటువైపే

    కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొన్ని నెలల నుంచి అక్కడ అధికార పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది. మొదట హిజాబ్ వివాదం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత అధికార పార్టీ అవినీతి ఆరోపణలు పట్టి కుదిపేసాయి. ఈసారి బిజెపికి అధికారం రావడం కల్లే అని అందరూ అనుకున్నారు. తర్వాత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారం చివరి దశలో కన్నడ ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపినట్టు కనిపించినా చివరికి వారు కాంగ్రెస్ కే ఓటు వేశారని ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా తెలుస్తోంది.

    డీలా పడిన బిజెపి

    మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో అధికార బిజెపి నాయకులు సంబరపడ్డారు. తర్వాత పోలింగ్ ఊపందుకోవడంతో కాంగ్రెస్ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వారి అంచనాకు తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ కూడా ఉండడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే హంగ్ లేదంటే హస్తం గా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పెద్దపార్టీగా అవతరిస్తుందని తేల్చాయి. దీంతో బిజెపి శిబిరంలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఇలానే అంచనాలు వేసి బోర్లా పడ్డాయి. మరి కర్ణాటక విషయంలో జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.