Agneepath : దేశమంతా ఇప్పుడు ‘అగ్నిపథ్’ గురించే చర్చించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని యువత ఆందోళన చెందుతోంది. ఇటీవలే పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇన్నాళ్లు తాము దేశ సేవ చేయాలని ఎదురుచూస్తుంటే.. తాత్కాలిక నియామకాలు అని చెప్పి అన్యాయం చేస్తున్నారని యువత ఆరోపిస్తోంది. వీరికి ప్రతిపక్షాలు కూడా తోడయ్యి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ బ్రాండ్ మైండెడ్ గా ఆలోచిస్తే అగ్నిపథ్ పథకం మంచిదేనని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అసలు ఈ పథకం ఏంటి..? దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాత ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని అంటున్నారు.
అసలు అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి..? దీనిని ఎందుకోసం తీసుకొచ్చారు..? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో తొలుస్తున్న ప్రశ్న. ఈ పథకం ద్వారా సైనికులను ఈ సంవత్సరం 46వేల మందిని ఎంపిక చేస్తారు. వీరికి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తరువాత రకరకాల పరీక్షలు చేస్తారు. అందులో ప్రతిభావంతులైన 25 శాతం మందికి శాశ్వత సైనికులుగా నియమిస్తారు. మిగతా వారికి సరైన మొత్తం ఇచ్చి ఇంటికి పంపిస్తారు. అయితే ఇప్పటి వరకు సైన్యంలో శిక్షణ పొందిన వారు దేశం నలుమూలల మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు శిక్షణ పొంది సైన్యంలో పనిచేసి నాలుగేళ్ల తరువాత ప్రజా జీవనంలో కలిసిపోతారు.
ప్రతీ యువకుడు 10వతరగతి పూర్తికాగానే అగ్నిపథ్ కు అర్హుడవుతారు. కనీం 17 ఏళ్ల వయసులో చేరిన వారు నాలుగేళ్ల శిక్షణ పొందుతారు. సైన్యం వీరికి కొన్ని పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తుంది. నాలుగేళ్ల పాటు 26500, 30000, 33000, 40 వేల జీతం ఇస్తారు. ఇందులో 30 శాతం నాలుగేళ్ల తరువాత వారికి ఇచ్చే సేవానిధి కోసం వారి జీతం నుంచి మినహాయిస్తారు. ఆ మొత్తానికి సమానంగా కేంద్రం అదనంగా చెల్లిస్తుంది. అంటే వడ్డీ సొమ్ముతో కలిపి మొత్తం 11.71 లక్షలు అదనంగా ఇస్తారు. ఇది నెలనెలా వచ్చే జీతానికి అదనం. అంటే మొత్తంగా 22 లక్షలకు పైగానే చేతికి అందుతుంది. అంతేకాకుండా 12వత తరగతికి సమానమైన ధ్రువపత్రాన్ని కూడా ఇస్తారు. వీటితో మిగతావారిలాగా ఉద్యోగాలు పొందవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా పోలీసు నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని కేంద్రం చెబుతోంది.
Also Read: Pawan Kalyan : దసరా తర్వాత మీ సంగతి చూస్తా.. హెచ్చరికలు పంపిన పవన్ కళ్యాణ్
సైన్యంలో చేరాలనే ఆశ చాలా మంది యువతకు ఉంటుంది. అయతే శాశ్వతంగా చేయాలనుకున్న తమకు తాత్కాలికంగా నియామకాలు చేపట్టి ఇంటికి పంపేస్తున్నారని వారు భావిస్తున్నారు. అయితే ప్రతిభ కనబర్చిన 25 శాతం మందిని శాశ్వతంగా నియమిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అందులో సెలెక్ట్ అయితే పర్మినెంట్ సైనికుల్లాగే ఉంటారు. ఇకవేళ నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చినా 22 లక్షలతో మొత్తంగా వస్తారు. ఆ తరువాత మంచి జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇది ఏ రకంగా చూసిన ప్రయోజనమే తప్ప నష్టం జరగదు.
అగ్నిపథ్ లాంటి పథకం ఇప్పటికే చాలా దేశాలు అమలు చేసి సక్సెస్ అయ్యాయి. ఇజ్రాయిల్ లో 12 నెలలు, ఇరాన్ లో 20నెలలే సైన్యంలో ఉంటారని నిపుణులు అంటున్నారు. సింగపూర్ లో ప్రతి డిగ్రీ చదివిన యువకుడు సైన్యంలో చేరి శిక్షణ తీసుకోవలనే నిబంధన ఉంది. అయితే ఇలా ప్రతి ఒక్కరు సైనికుడు కావడం మంచి పద్దతే. కానీ అన్ని దేశాల్లో అమలు కావడం అసాధ్యం. జనాభా ఎక్కువగా ఉన్న మనదేశంలో ఇది సాధ్యం కాదు. కానీ ఇలా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో ఉండి తిరిగి కొత్త జీవితం ప్రారంభిస్తే వారి భవిష్యత్ బాగుంటుందని అంటున్నారు.
అగ్నిపథ్ పథకం ఎటునుంచి చూసి ప్రయోజనకరంగా ఉండడం వల్ల యువత ఆందోళన చేయడం తగదని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఇటీవల ఆందోళన చేసిన చాలా మంది వారికి అవగాహన లేకపోవడం వల్లే ఆవేశపరులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటోంది. ఇదిలా ఉండగా అగ్నిపథ్ అనేది ఆప్షనల్ మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే నాలుగేళ్లపాటు సైన్యంలో ఉండి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యేవారు.. లేదా శాశ్వతంగా సైన్యంలో ఉండేవారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నారు. దీంతో కాస్త అయోమం నెలకొంది.
Also Read: Vishakapatnam: ఆదివారం ఉదయం… సాగర తీరంలో ఉలిక్కిపడుతున్న విపక్షం
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Everything is fine if you think about agneepath
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com