https://oktelugu.com/

డిజిటల్‌కే డిమాండ్‌

యావత్‌ దేశం డిజిటల్‌తోనే పరుగులు పెడుతోంది. ఫ్యూచర్‌‌లో డిజిటల్‌ వినియోగం మరింత పెరగనుంది. ఈ క్రమంలో రానున్న ఐదేళ్లలో డిజిటల్‌ ఉద్యోగాలకే డిమాండ్‌ పెరుగుతుందని అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ అభిప్రాయపడింది. 2025 నాటికి ప్రస్తుతమున్న 2.5 కోట్ల డిజిటల్‌ నైపుణ్య ఉద్యోగుల సంఖ్య తొమ్మిది రెట్లు పెరగాలని పేర్కొంది. కార్మిక బలగంలోని 69శాతం మందికి డిజిటల్‌ నైపుణ్యాలు కల్పించాలని.. ఈ మేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆసియా పసిఫిక్‌ దేశాలతో పోల్చితే దేశంలో డిజిటల్‌ నిపుణులైన […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 29, 2021 3:13 pm
    Follow us on

    Demand for Digital in India
    యావత్‌ దేశం డిజిటల్‌తోనే పరుగులు పెడుతోంది. ఫ్యూచర్‌‌లో డిజిటల్‌ వినియోగం మరింత పెరగనుంది. ఈ క్రమంలో రానున్న ఐదేళ్లలో డిజిటల్‌ ఉద్యోగాలకే డిమాండ్‌ పెరుగుతుందని అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ అభిప్రాయపడింది. 2025 నాటికి ప్రస్తుతమున్న 2.5 కోట్ల డిజిటల్‌ నైపుణ్య ఉద్యోగుల సంఖ్య తొమ్మిది రెట్లు పెరగాలని పేర్కొంది.

    కార్మిక బలగంలోని 69శాతం మందికి డిజిటల్‌ నైపుణ్యాలు కల్పించాలని.. ఈ మేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆసియా పసిఫిక్‌ దేశాలతో పోల్చితే దేశంలో డిజిటల్‌ నిపుణులైన ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. భారత్‌లో అత్యల్పంగా 12 శాతం మందికే నైపుణ్యముందని వెల్లడించింది. మరోవైపు.. భవిష్యత్‌ టెక్నాలజీలపై పనిచేస్తున్న వారి సంఖ్యా తక్కువే.

    దేశంలోని 3500లకు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి లక్షలాది మంది ఇంజినీరింగ్‌ పట్టాలతో బయటకు వస్తున్నా.. వీరిలో 90 శాతం మందికి సాఫ్ట్‌వేర్‌‌ ప్రోగ్రామ్స్‌ మీద పనిచేసే అంత నైపుణ్యాలు ఉండడం లేదని సర్వేలో తేలింది. విద్యాసంస్థలు, పరిశ్రమలకు మధ్య సంబంధాలు, సరైన అవగాహన లేకపోవడం ప్రధానం లోపంగా తెలుస్తోంది.

    ప్రధానంగా డిజిటల్‌ కార్మికులకు మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలి. నాన్‌ టెక్నికల్‌ రంగాల్లో డిజిటల్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇంటర్మీడియెట్‌ స్థాయి వరకు విద్యార్థుల్లో సైన్స్‌, మ్యాథ్స్‌, సబ్జెక్టులు, డిజిటల్‌ స్కిల్స్‌లో నైపుణ్యం పెంచేలా పాఠ్యప్రణాళిక రూపొందించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమలతో విద్యాసంస్థల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాంకేతికేతర రంగాల్లోనూ డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించేలా విధానాలు రూపొందించాలి. అందుకే అవకాశాలు కల్పించే పరిశ్రమల యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. నిరుద్యోగులు, మహిళలు, యువతకు డిజిటల్‌ శిక్షణ లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. పరిశ్రమల్లో అప్రంటీస్‌ అవకాశాలు పెంచి.. కార్మిక బలగంలోకి తీసుకోవాలని సూచించింది.

    దేశంలోని 76 శాతం మంది డిజిటల్‌ నిపుణులు 2025 నాటికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మెలకువలు సాధించాలి. క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌‌ డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌‌ ఆపరేషన్స్‌ సపోర్టు, వెబ్‌సైడ్‌/గేమ్‌/సాఫ్ట్‌వేర్‌‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌, సైబర్‌‌ సెక్యూరిటీ రంగాల్లో అపారమైన అవకాశాలు లభించనున్నాయి. అడ్వాన్డ్స్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా స్కిల్స్‌ రంగాల్లో ఉద్యోగాల డిమాండ్‌ మూడింతలు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది.