https://oktelugu.com/

Crime News : కూతురు కిడ్నాప్‌ డ్రామా.. డబ్బుల కోసం ఎంత పనిచేసిందంటే?

తన మిత్రులతో కలిసి పారిన్‌ ట్రిప్‌ వెళ్లేదుకే కావ్య ఈ డ్రామ ఆడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి అందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత కావ్యను తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2024 1:34 pm
    Crime News

    Crime News

    Follow us on

    Crime News : ఓ యువతి డబ్బుల కోసం తన స్నేహితులతో కలిసి నాటకం ఆడింది. తనను చేతులతో కట్టేసుకుని కిడ్నాప్‌ డ్రామాకు తెరలేపింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన రాజస్తాన్‌లో జరిగింది. అంతకుముందు పోలీసులతోపాటు, తల్లిదండ్రులకు చెమటలు పట్టించింది.

    – ఏం జరిగిందంటే..

    రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి కావ్య. తన స్నేహితులతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. వారు లేవని చెప్పడంతో నిరాశ చెందింది. కానీ స్నేహితులు అందరం కలిసి వెళ్దామని ఒత్తిడి చేయడంతో కాదనలేకపోయింది. స్నేహితుల సలహాతోనే కిడ్నాప్‌ డ్రామాకు తెరలేపింది.

    – ఫొటోలు పంపించి రూ.30 లక్షల డిమాండ్‌..

    తన స్నేహితులతో తన చేతులు కట్టేయంచుకుంది కావ్య. తర్వాత ఆ దృశ్యాలను ఫొటోతీసి తన తండ్రి ఫోన్‌కు పంపించింది. తర్వాత ఫోన్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేయించింది. యువతి కిడ్నాప్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో కేంద్రమంత్రి సింధియా సైతం స్పందించారు. త్వరగా యువతిని కాపాడాలని పోలీసులను ఆదేశించారు.

    – రంగంలోకి పోలీసులు..

    వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఆచూకి కనుగునేందుకు ఇంటికి వెళ్లారు. కూతురు స్నేహితులు, కాలేజీ వివరాలు, శత్రువుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కావ్యతోపాటు ఆమె స్నేహితుల ఫోన్లు ట్రేజ్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమలో కావ్య అడ్రస్‌ కనిపెట్టారు. వెంటనే లొకేషన్‌కు చేరుకుని షాక్‌ అయ్యారు.

    – ఫారిన్‌ వెళ్లేందుకే..

    తన మిత్రులతో కలిసి పారిన్‌ ట్రిప్‌ వెళ్లేదుకే కావ్య ఈ డ్రామ ఆడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి అందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత కావ్యను తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది.