Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల వేళ ఏకంగా పార్టీలకే ఫైనాన్స్.. ఈ పెద్దాయన మామూలోడు కాదు!

చాలా పార్టీలకు, ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఈయన ఫైనాన్స్ చేస్తాడని.. ఎన్నికల్లో గెలుపు కోసం వారికి ఆర్థిక సాయం చేసి గెలిచాక వడ్డీతో వసూలు చేసుకుంటాడని ఓ ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.

Written By: NARESH, Updated On : May 2, 2023 6:52 pm

party funds

Follow us on

Karnataka Elections 2023 : ప్రముఖ పత్రికాధినేత తన ఫైనాన్స్ వ్యాపారంతో బాగా సంపాదించాడని పేరుంది. ప్రజల నుంచి చిట్టీల పేరుతో వేల కోట్లు వసూలు చేసి..  వడ్డీలకు వడ్డీలు తిప్పి బాగా లబ్ధి పొందాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు వెలికితీస్తున్నాయి. అక్రమాల ఆ కోట పునాదులను తవ్వి తీస్తున్నాయి.

అయితే పత్రికాధినేత దగ్గరకు కేంద్రం, రాష్ట్ర పెద్దలు కూడా కలవడానికి స్వయంగా రావడానికి కారణం ఏంటి? ఆ పెద్దాయనకు అత్యున్నత పదవిని ఎందుకు ఇచ్చారు? అని ఆలోచిస్తే అందులో అంతకుమించిన ‘పెట్టుబడి’ దందా ఉందని ఒక ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.

అప్పట్లో ఓ ప్యాన్ ఇండియా సినిమాను ఆయన కోట ఏరియాలోనే తీశారు. ఈ షూటింగ్ సందర్బంగా సినిమా వ్యయం ఎక్కువైపోయి నిర్మాత చేతులు ఎత్తేస్తే మంచి సినిమా అని తెలుసుకొని ఈ పెద్దాయనే ఫైనాన్స్ చేశాడట.. సినిమా హిట్ అయ్యాక వడ్డీతో సహా వసూలు చేశాడని ఓ టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది.

ఇప్పుడు దేశంలోనే టాప్ మోస్ట్ రాజకీయ నేతలు సైతం ఈయన కోటకు వచ్చి మరీ చర్చలు జరపడం వెనుక కూడా ఆ డబ్బుల కట్టలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఎన్నికలు వస్తే చాలు ఈ పెద్దాయన వద్దకు నేతలు క్యూ కడుతుంటారు. చాలా పార్టీలకు, ప్రముఖ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఈయన ఫైనాన్స్ చేస్తాడని.. ఎన్నికల్లో గెలుపు కోసం వారికి ఆర్థిక సాయం చేసి గెలిచాక వడ్డీతో వసూలు చేసుకుంటాడని ఓ ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లు రావడానికి కారణం అదేనంటున్నారు.

తాజాగా మన పక్కరాష్ట్రంలో జరిగే ఎన్నికలకు కూడా ఈ పెద్దమనిషి ఓ పార్టీకి ఫైనాన్స్ చేస్తున్నాడన్న ప్రచారం బాగా సాగుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ..ఓ నేత ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ గా బయటపెట్టడంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది. ఈయన సంపద అంతా ఆయన పెట్టిన ఫైనాన్స్ సంస్థ ద్వారానే వచ్చిందా? అని డౌట్ వ్యక్తం చేశాడట.. జాతీయ ప్రాంతీయ పార్టీలకే అంత ఫైనాన్స్ చేస్తున్నాడంటే ఈయన దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.