Rare Carpenter Shark Caught In Karnataka Coast: అత్యంత అరుదైన.. అంతరించిపోతున్న రంపపు చేపను గురువారం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని మాల్పేలో మత్స్యకారులు పట్టుకున్నారు. సుమారు 250 కిలోల బరువున్న 10 అడుగుల పొడవైన కార్పెంటర్ షార్క్ ప్రమాదవశాత్తు ‘సీ కెప్టెన్’ అనే పడవ వలల్లో చిక్కుకుంది.

ఇంటర్నెట్లో రంపపు చేప ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దాని పొడవటి రంపపు ముక్కు చూస్తే ఎవరికైనా గుండెలు ధడేల్ మనేలా భీకరంగా ఉంది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంపపు చేపను జేసీబీ క్రేన్ ద్వారా పైకి ఎత్తడం చూడవచ్చు. క్రేన్‌తో చనిపోయిన రంపపు చేపను మల్పే ఫిషరీస్ హార్బర్లో వేలానికి తీసుకువచ్చారు. అక్కడ దానిని మంగళూరుకు చెందిన ఒక వ్యాపారికి విక్రయించారు.
Also Read: Samantha Comments On Pushpa Song: నేను చేసినవన్నీ మర్చిపోయారు – సమంత
కాగా ఈ అరుదైన రంపపు చేపను అక్రమంగా పట్టుకున్నారని మత్స్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సమీపంలోని మత్స్యశాఖ కార్యాలయ అధికారులు ఈ మేరకు అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు తేల్చి నివేదిక రూపొందించారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ద్వారా ఐదు జాతుల సాఫిష్లు అంతరించిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇవి తీవ్రంగా అంతరించిపోతున్నట్లు తేల్చారు. తరచుగా వాటి రెక్కలు, దంతాలు.. రంపపు ముక్కు కోసం వేటాడి చంపుతున్నట్టు తేలింది. వాటికి డిమాండ్ బాగా ఉందని.. వాటి అవయవాలతో వ్యాపారం చేసి వెనకేసుకుంటున్నారని సమాచారం.
Also Read: AP Budget 2022-23: ఏపీ ఆర్థిక బడ్జెట్ ప్రత్యేకతలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే..?
As per the experts, Carpenter sharks are an endangered species with their population has been on a decline. They are a protected species in India under Schedule I of the Wildlife Protection Act 1972.pic.twitter.com/mEruTiwFyQ
— Mangalore City (@MangaloreCity) March 12, 2022
వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972లోని షెడ్యూల్ 1 ప్రకారం భారతదేశంలో సాఫిష్ రక్షిత జాతులు, వాటిని వేటాడడం.. వ్యాపారం చేయడం నేరం. పులి లేదా ఏనుగును చంపినందుకు ఇచ్చే శిక్షకు సమానమైన శిక్షను ఈ రంపపు చేపలను చంపితే విధిస్తారు.
