Crashing Army Helicopter: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఈరోజు మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని షాక్ గురిచేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఏదైనా కుట్రకోణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదం వార్త తెలియగానే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీకి సమాచారం అందించారు. ఆయన వెంటనే అత్యవసరంగా కేంద్ర క్యాబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్చిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆయన కొద్దిసేపట్లోనే కీలక ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది.
ఢిపెన్స్ చీఫ్ బిపిన్ రావత్ తన భార్యతో కలిసి తమిళనాడులో ఓ కాలేజీలో ప్రసంగం చేసేందుకు నేడు ఆర్మీ హెలికాప్టర్లో వెళుతున్నారు. మధ్యాహ్నం 2గంటల 45 నిమిషాలకు ఆయన ఈ ప్రసంగం చేయాల్సి ఉంది. అయితే ఆ లోపే తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో మొత్తం 10మంది ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పలువురిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుమంది మృత్యువాత పడినట్లు వార్తలు విస్తున్నాయి. ఈ సంఘటనలో జనరల్ రావత్ బతికున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ వివరాలను అధికారులు గోప్యం ఉంచుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలతో క్షేమంగా బయటపడగా వీరిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే దీనిపై కేంద్రం మాత్రం పార్లమెంట్ లో అధికారిక ప్రకటన చేసే అవకాశం కన్పిస్తుంది.
Also Read: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?
ఇక ఈరోజు ప్రమాదానికి గురైన ఈఎంఐ 17వీ5 హెలికాఫ్టర్ ను ఆర్మీ 2012లో రష్యా నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఆర్మీ ప్రత్యేక అవసరాల కోసమే వినియోగిస్తోంది. ఈక్రమంలోనే త్రివిధ దళాధిపతి హోదాలో జనరల్ బిపిన్ రావత్ తన భార్యతో కలిసి నేడు హెలికాప్టర్లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆయనకు తోడు పలువురు సహాయకులు వెళ్లారు. వీరంతా కూడా ప్రమాదం బారినపడటం శోచనీయంగా మారింది. ఈ ప్రమాద సంఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో దీనిపై కేంద్ర్ం కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది.
BREAKING
Indian Air Force Mi-17V5 helicopter, with CDS General #BipinRawat on-board, meets with an accident near Coonoor, Tamil Nadu pic.twitter.com/M1rAxkFKuF
— DD News (@DDNewslive) December 8, 2021
Also Read: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?