https://oktelugu.com/

ఆరోగ్య రంగమంటే ఇంత చిన్న చూపా..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు సరిగా పరీక్షలు చేయడంలేదని, ఆరోగ్య సిబ్బందికి తగినన్ని పీపీఈ కిట్‌ లు అందించలేదని, వారికి వేతనాలు కూడా ఇవ్వలేదనే వార్తలుఊపందుకున్నాయి. ఇవి భారత ఆరోగ్య రంగంలోఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాయి. అయినా, దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎవరికీ తెలీనిది కాదు. వాటిలో డాక్టర్లు, పడకలు, సౌకర్యాలు, మందుల కొరత సర్వ సాధారణం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దురుసుగా ప్రవర్తిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 7, 2020 9:47 am
    Follow us on

    Health

    దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు సరిగా పరీక్షలు చేయడంలేదని, ఆరోగ్య సిబ్బందికి తగినన్ని పీపీఈ కిట్‌ లు అందించలేదని, వారికి వేతనాలు కూడా ఇవ్వలేదనే వార్తలుఊపందుకున్నాయి. ఇవి భారత ఆరోగ్య రంగంలోఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాయి. అయినా, దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎవరికీ తెలీనిది కాదు. వాటిలో డాక్టర్లు, పడకలు, సౌకర్యాలు, మందుల కొరత సర్వ సాధారణం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దురుసుగా ప్రవర్తిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితి రెండు మూడేళ్ల ముందు నుంచే కాదు, మొదటి నుంచీ ఉంది.

    దీనికి ముఖ్య కారణం ఆరోగ్య రంగంలో పెట్టుబడుల లోటు. అయితే గత ఏడాది ప్రభుత్వ బడ్జెట్‌ లో ఆరోగ్య రంగానికి అంతకుముందుతో పోలిస్తే ఎక్కువే కేటాయించారు. ఆ కేటాయింపులు 2016-17లో సుమారు రూ. 37 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 65 వేల కోట్లకు పైనే చేరింది. కానీ అది ఇప్పటికీ భారత్ మొత్తం జీడీపీలో రెండు శాతం కంటే తక్కువే ఉంది. ఆరోగ్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ వైపు నుంచి ఖర్చు చేస్తాయి. ఇటీవల కొంతకాలంగా దేశ ఆరోగ్య రంగంలో ప్రైవేటు కంపెనీల జోక్యం కూడా చాలా వేగంగా పెరిగింది. కానీ, అక్కడ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా లభించే సౌకర్యాలకు చార్జీలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయి. దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.

    ఐదు అభివృద్ధి చెందిన దేశాలు – బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా)లో ఆరోగ్య రంగంలో చేసే ఖర్చు విషయంలో భారత్ మిగతా అన్ని దేశాల కంటే దిగువన ఉండటం గమనార్హం. బ్రెజిల్ తన మొత్తం జీడీపీలో 9.2 శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయిస్తుంది. ఇక భారత్‌ తో పోల్చి చూసే చైనాలో అది 5 శాతం ఉంది. అంటే భారత్ కంటే రెండున్నర శాతం అధికం.

    భారత్‌ లో ఎవరి ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యంపై ఎప్పుడూ 2 శాతం కంటే తక్కువ వ్యయమే ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం అది 5 శాతానికి దగ్గరగా ఉండాలి. భారత్‌ లో ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం అంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం రెండు పదవీకాలాలతో పోలిస్తే ఆరోగ్యంపై ఎక్కువే ఖర్చు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాలను పోల్చి చూస్తే తన ఆరేళ్ల పదవీ కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఆరోగ్య రంగానికి చేసిన ఆర్థిక కేటాయింపులు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. అంతే కాదు, ఎన్డీయే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ఆరోగ్యం అందించే దిశగా అత్యంత ప్రతిష్టాత్మక పథకంగా చూస్తున్నారు. కానీ, ఆరోగ్య బీమా పథకాన్ని యూపీఏ పదవీ కాలంలోనే ప్రారంభించారని, ఆరోగ్యానికి ఆర్థిక కేటాయింపులు మాత్రం ఎన్డీయే పదవీకాలంతో పోలిస్తే తక్కువే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

    అయితే ఆరోగ్యం అనేది రాష్ట్రాల అంశం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ భారత రాష్ట్రాలు, ఛత్తీస్‌ గడ్‌ లో తమదైన ఆరోగ్య విధానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజనకు బదులు తమ సొంత పథకాలు రూపొందించాయి.