https://oktelugu.com/

దేశమంతా కరోనా టీకా ఫ్రీ

పోయిన ఏడాది మొత్తం కరోనాతోనే ప్రజలు సాహవాసం చేశారు. లక్షలాది జనం కరోనా బారిన పడ్డారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతుచిక్కని వైరస్‌తో నిద్రలేని రాత్రులూ గడిపారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరెన్నో కుటుంబాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇన్నాళ్లు టీకా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఇక ఆ శుభముహూర్తం రానే వచ్చింది. నిన్ననే టీకాకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేశంలో ప్రజలకు టీకా వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే..ఈ వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2021 / 03:37 PM IST
    Follow us on


    పోయిన ఏడాది మొత్తం కరోనాతోనే ప్రజలు సాహవాసం చేశారు. లక్షలాది జనం కరోనా బారిన పడ్డారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతుచిక్కని వైరస్‌తో నిద్రలేని రాత్రులూ గడిపారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరెన్నో కుటుంబాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇన్నాళ్లు టీకా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఇక ఆ శుభముహూర్తం రానే వచ్చింది. నిన్ననే టీకాకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేశంలో ప్రజలకు టీకా వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే..ఈ వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారా అనేది ఇన్నాళ్లను అనుమానం ఉండేది. కానీ.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆ అనుమానాలకు సమాధానం చెప్పుకొచ్చారు.

    Also Read: పల్లెల నుంచే ఐటీ సేవలు

    దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందజేస్తామని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఢిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఆయన ఈ ప్రకటన చేశారు. ‘తొలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి, రెండు కోట్ల ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ఉచితం టీకా అందజేస్తాం. తర్వాత 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నాం’ అని ట్విటర్‌‌ వేదికగా ప్రకటించారు.

    కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపిన తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. టీకా డ్రైరన్‌ జరుగుతున్న సందర్భంగా వ్యాక్సిన్‌పై అనేక వదంతులు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని హర్షవర్ధన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా సామర్థ్యం, భద్రత, రోగ నిరోధక శక్తికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. పోలియో టీకా వేసే సమయంలోనూ ఇలాంటి ఉదంతులు వచ్చాయని.. అయినా వాటిని పట్టించుకోకుండా టీకా అందించి ఇప్పుడు పోలియో రహిత ఇండియాగా తీర్చిదిద్దామని తెలిపారు.

    Also Read: జగన్ పై పోరు.. 4 నుంచి జేసీ ఆమరణ దీక్ష

    కాగా.. 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ శనివారం ప్రారంభమైంది. ఈ డ్రైరన్‌ కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి విడత డ్రైరన్‌లో తలెత్తిన లోపాలను సవరించి కొత్త మార్గదర్శకాలను ఇచ్చారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్