https://oktelugu.com/

Boycott Maldives: మోడీనే తిడతారా.. బ్యాన్ మల్దీవుల ఎలా మొదలైంది? అసలు వివాదమేంటి?

మాల్దీవులకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ దేశానికి భారత్ నుంచి అత్యధికంగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. సింహభాగం పర్యాటక ఆదాయం మనదేశం నుంచి అక్కడికి వెళుతూ ఉంటుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 8, 2024 4:44 pm
    Boycott-Maldives
    Follow us on

    Boycott Maldives: అదో చిన్న ద్వీపదేశం. పర్యాటకమే దాని ప్రధాన ఆదాయం. అలాంటి ఆ దేశం.. భారత్ నుంచి సింహభాగం ఆదాయం పొందుతున్న ఆ దేశం తన అక్కసు వెళ్ళగక్కింది. అంతేకాదు తమ దేశంలో ఇస్లాం మతం ఆచరణలో ఉంది కాబట్టి.. ప్రపంచంలో ఇస్లాం దేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. భారతదేశాన్ని వ్యతిరేకిస్తే తనకు తిరగులేదు అనుకుంది. కాని చివరికి బొక్కా బోర్లా పడ్డది. ఆడుసు తొక్కింది. చివరికి కాళ్ళు కడుక్కునే ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఆ దేశం చేసిన తప్పేంటి? ఒక బుల్లి దేశం ఒక్కసారిగా వార్తల్లోకి ఎందుకు ఎక్కింది.. సామాజిక మాధ్యమాలలో ఎందుకు చర్చనీయాశం అయింది?

    మాల్దీవులకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ దేశానికి భారత్ నుంచి అత్యధికంగా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. సింహభాగం పర్యాటక ఆదాయం మనదేశం నుంచి అక్కడికి వెళుతూ ఉంటుంది. అయితే మన దేశంపై, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఆ దేశానికి చెందిన మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్య ద్వీప్ పర్యటనకు వెళ్లారు. లక్ష్య ద్వీప్ ను భారతీయులు తమ విహారయాత్రలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.. అయితే దీనిపై మాల్దీవుల మంత్రులు మండిపడ్డారు. లక్షద్వీప్ లో మాల్దివుల్లాగా సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందా అంటూ ప్రశ్నించారు. భారత్ ఒక మురికి దేశమని అభివర్ణించారు. అంతేకాదు నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పప్పెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు.. భారత్ ను ఆవు పేడతో పోల్చారు.. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    మాల్దీవుల మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ప్రారంభమైంది. దేశంలోని సచిన్ టెండూల్కర్ నుంచి మొదలుపెడితే హార్దిక్ పాండ్యా వరకు దీనిపై స్పందించారు. భారతదేశాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని మాల్దీవుల మంత్రులు విమర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇకపై భారతీయులు లక్ష్య ద్వీప్ పర్యటనకే వెళ్లాలని.. మాల్దీవులను బాయికాట్ చేయాలని కోరారు. భారతదేశంలోని అందమైన తీర ప్రాంతాలను, బీచ్ లను సందర్శించాలని బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, శ్రద్ధ కపూర్ సామాజిక మాధ్యమాల వేదికగా భారతీయులను కోరారు. అంతేకాదు తను 50వ పుట్టినరోజును కొంకన్ తీరంలో జరుపుకున్నానని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ లో పేర్కొన్నారు. బాయికాట్ మాల్దీవుల ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. భారత్ నుంచి వచ్చే యాత్రికుల మీద ఆధారపడే దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన చురకలు అంటించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాయ్ కాట్ మాల్దీవులు అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దేశ విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మొత్తం దీనికి మద్దతు పలుకుతున్నారు. మాల్దీవులకు వెళ్లాలనే తమ ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు.