https://oktelugu.com/

Chandrababu – BJP : ఆ లెక్కలతోనే బాబును పక్కనపెడుతున్న బీజేపీ

చంద్రబాబుకు అధికారమిస్తే.. ఆయన స్వరం మార్చుకుంటే బీజేపీకే నష్టం. అందుకే చంద్రబాబును నిర్వీర్యం చేయడమే బీజేపీ ముందున్న కర్తవ్యం.

Written By:
  • Dharma
  • , Updated On : June 2, 2023 / 12:29 PM IST
    Follow us on

    Chandrababu – BJP : బీజేపీ పెద్దలు చంద్రబాబును పక్కనపెట్టడానికి చాలా లెక్కలున్నాయట. బాబుగారి చరిత్ర తవ్వి మరీ మోదీ, షా తెలుసుకున్నారుట. వన్స్ ఆయన విన్నరైతే తమకు మూడోసారి అధికారాన్ని గండికొడతారని భావిస్తున్నారుట. ఆయన్ను ఏపీలో ఓడిస్తేనే సేఫ్ జోన్ లో ఉండగలమని డిసైడయ్యారుట. ఢిల్లీ వర్గాల్లో ఇప్పుడిదే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ను రెండోసారి ఓడించి.. దేశంలో హ్యాట్రిక్ కొట్టాలని మోదీ, షా ద్వయం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ బీజేపీకి నమ్మదగిన మిత్రుడు చంద్రబాబు అని విశ్లేషణలు వెలువడినా.. అంతర్గత విశ్లేషణలు మాత్రం బీజేపీకి చావు దెబ్బ కొట్టింది కూడా ఆయనేనని చెబుతున్నాయి.
     1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. వాజ్ పేయ్ ప్రమాణం చేసినా కూడా కుర్చీ నుంచి దించి యునైటెడ్ ఫ్రంట్ ని అప్పటికపుడు కట్టి దేవేగౌడాను ప్రధానిగా చేసిన వ్యూహం బాబుది. అంతే కాదు 1999 దాకా బీజేపీకి బాబు చుక్కలు చూపించారు. 1999 తరువాత కూడా ఎన్టీఏ చైర్మన్ పదవిని తన వద్ద ఉంచుకొని వాజ్ పేయ్ సర్కారుకు చుక్కలు చూపించారు. దేశంలో బీజేపీ ఎదగకుండా తెరవెనుక ప్రాంతీయ పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచింది చంద్రబాబే.
    2014లో ఎన్డీఏలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చినా పై కారణాలతోనే మోదీ సర్కారు సహకరించలేదు. దానిని గ్రహించలేని నేత కాదు చంద్రబాబు. అందుకే మరోసారి విశ్వరూపం చూపేందుకు 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. తాను ఏపీలో గెలవడం కంటే కేంద్రంలో బీజేపీ ఓడిపోవాలనే ఎక్కువగా ఆశించారు. చివరకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు పావులు కదిపారు. ఓటమి ఎదురయ్యేసరికి బాబుకి తత్వం బోధపడింది. మళ్లీ బీజేపీకి స్నేహహస్తం అందిస్తున్నా వారు అందుకోవడం లేదు. ఎన్డీఏలోకి ఆహ్వానించడం లేదు.
    జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రతికూలత ప్రారంభమైంది. మున్ముందు ఇది మరింతగా పెల్లుబికనుంది. కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుంది. ఈ తరుణంలో  బీజేపీ టీడీపీతో పొత్తు కట్టినా అవి ఎన్నికల్లో గెలిచే వరకే.  ఒక్కసారి అధిక ఎంపీ సీట్లు బాబు చేతిలో పడ్డాక కచ్చితంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు అని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు. విపక్ష కూటమికి ఇపుడు కొంత అనుకూల వాతావరణం ఉన్నా చంద్రబాబు లాంటి వారు అక్కడ లేకపోవడం లోటు. అందుకే చేజేతులా చంద్రబాబుకు అధికారమిస్తే.. ఆయన స్వరం మార్చుకుంటే బీజేపీకే నష్టం. అందుకే చంద్రబాబును నిర్వీర్యం చేయడమే బీజేపీ ముందున్న కర్తవ్యం.