Bihar Beggar:అడుక్కునే బిచ్చగాడు కూడా అప్డేట్ అవుతున్నాడు. మునుపటిలా ఎవరూ చిల్లరను, నోట్లను జేబులో పెట్టుకొని ఎవరూ తిరగడం లేదు. మొత్తం ఆన్ లైన్ పేమెంట్స్. యూపీఏ ద్వారా స్కాన్ చేసి డబ్బు పంపిస్తున్నారు. దీంతో బిచ్చగాళ్లకు ముష్టి అడుక్కోవడానికి కూడా ఇబ్బంది అవుతోంది.అందుకే వాళ్లు కూడా అప్డేట్ అవుతున్నాడు.

కేంద్రంలోని మోడీ సర్కార్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేవి అందరికీ మొబైల్ ఫోన్ లోనే అందుబాటులోకి తేవడంతో అప్పటినుంచి ఎవరి దగ్గర క్యాష్ ఉండడం లేదు. చిన్న చిన్న దుకాణాలు కూడా డిజిటల్ లావాదేవీల కోసం స్కానర్ లను పెట్టుకుంటున్నారు. మరి ఇలా ఉంటే బిచ్చగాళ్ల పరిస్థితి ఏంటి? అందుకే వారు కూడా డిజిటల్ అడ్డుక్కోవడానికి మారిపోతున్నారు.
తాజాగా బీహార్ కు చెందిన ఓ బిచ్చగాడు సరికొత్త ఐడియాతో అందరినీ ఆకట్టుకున్నాడు. దాదాపు లావాదేవీలు అన్ని డిజిటల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి లేని వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందుకే బిచ్చగాళ్లనుంచి కోటీశ్వరుల వరకూ అందరూ యాప్స్ వాడుతున్నారు.స్కానర్స్ పెట్టుకుంటున్నారు.
బీహార్ కు చెందిన 40 ఏళ్ల బిచ్చగాడు కూడా అప్డేట్ అయ్యాడు. ఈ అప్డేట్ బెగ్గర్ టెక్నాలజీ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బీహార్ కు చెందిన 40 ఏళ్ల రాజు పటేల్ అనే బిచ్చగాడు ‘బెత్తయ్యా రైల్వే స్టేషన్’ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడు ప్రధాని మోడీ మొదలుపెట్టిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ను ఫాలో అవుతూ తన మెడకు ఒక క్యూఆర్ కోడ్ ను తలిగించుకొని భిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాను డిజిటల్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తానని.. అది తన కడుపు నింపుకోవడానికి సరిపోతుంది అని రాజుపటేల్ అంటున్నారు. బిచ్చమెత్తుకోవడంలోనూ టెక్నాలజీని వాడుకుంటున్న రాజు పటేల్ ను చూసి ఇప్పుడు అందరూ అబ్బురపడుతున్నారు. ఇతడి గురించి వైరల్ చేస్తున్నారు.