Bihar Assembly Elections: ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎన్నికల సంఘం అధికారులు చెబుతుంటారు. ప్రజలను జాగృతం చేస్తూ ఉంటారు. ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. కానీ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా ముందుకు వస్తే రాజకీయ పార్టీల నాయకులు ఒకరకంగా ఒత్తిడికి గురవుతుంటారు. రాజకీయ పార్టీల నాయకులకు కావాల్సింది ఒక మోస్తారు పోలింగ్ మాత్రమే. భారీగా పోలి నమోదు అయితే వారు విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే పోలింగ్ ఎక్కువ నమోదు అయితే ఓటింగ్ సరళి మీద నాయకులకు ఒక అంచనా ఉండదు. అందువల్లే ఒక స్థాయి వరకే పోలింగ్ నమోదు కావాలని నాయకులు కోరుకుంటారు. అధికార, ప్రతిపక్ష అని తేడా లేకుండా అందరి భావన కూడా ఇదేవిధంగా ఉంటుంది.
బీహార్ రాష్ట్రంలో రెండు విడుదల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 122 స్థానాలను సంపాదించుకుంటే అధికారాన్ని దక్కించుకోవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా బీహార్ ప్రజలు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. పైగా మూడు రోజులు పర్యాయాలు ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయినప్పటికీ.. మొదటిసారి ఎన్డీఏతో.. ఆ తర్వాత మహా ఘట్ బంధన్ తో.. మళ్లీ చివరికి ఎన్డీఏతో ఆయన జత కట్టారు. ఈసారి కూడా ఫలితం అదేవిధంగా ఉంటుందా.. మారుతుందా.. అనేది చూడాల్సి ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఈసారి భారీగా పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారి కూడా అధికార పార్టీ కుర్చీ దిగి వెళ్లిపోయింది. బీహార్ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఇదేవిధంగా పోలింగ్ నమోదు కావడం వల్ల అధికార పార్టీలు కుర్చీకి దూరమయ్యాయి. 1967 లో దాదాపు ఏడు శాతం ఓటింగ్ పెరిగింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. 1980 లో ఓటింగ్ 6.8% పెరిగింది.. 1990లో 5.7% ఓటింగ్ పెరిగింది. ఆ సమయాలలో అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లో 9.6% ఓటింగ్ పెరిగింది. ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉంటుంది.. 1967, 1980, 1990 మాదిరిగానే ఫలితం ఉంటుందా.. లేక ఈసారి విభిన్నమైన తీర్పు వస్తుందా చూడాల్సి ఉంది.
కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మధ్యాహ్నం వరకు ట్రెండ్ మీద క్లారిటీ వస్తుందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. మరోవైపు ఈ సంస్థల అంచనాలు రాంగ్ అవుతాయని.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పు మరో విధంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.