Army Helicopter: త్రివిధ దళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కుప్పకూలిన సంఘటన తెల్సిందే. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 11మంది దుర్మరణం చెందినట్లు తాజాగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కు తీవ్రగాయాలు కాగా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితిపై మాత్రం ఆర్మీవర్గాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉత్కంఠత నెలకొంది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేడు తన భార్యతో కలిసి తమిళనాడులో ఓ కాలేజీలో ప్రసంగించేందుకు ఆర్మీ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు ఆయన ఆ కళాశాలలో ప్రసంగం చేయాల్సి ఉంది. ఆలోపే తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడం దురదుష్టకరంగా మారింది. ఇందులో మొత్తం 14మంది ప్రయాణించారని ఆర్మీవర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా ఈ ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? ఏదైనా కుట్ర కోణం ఉందా? అనేది తేల్చనున్నారు. ఈమేరకు దీనిపై పార్లమెంటులో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాన్ని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించబడిందని భారత వైమానిక దళం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో తాజాగా పేర్కొంది.
ఈ ప్రమాదంపై వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు పలువురు మంత్రులు, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. కాగా ప్రమాద సంఘటనలో లభ్యమైన మృతదేహాలను ఆర్మీవర్గాలు కూనూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరిని తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్నారు. అలాగే ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు రావత్ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెబుతారనే ఉత్కంఠత నెలకొంది.
Also Read: కూప్పకూలిన ఆర్మీ పెద్ద హెలికాప్టర్.. కాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన?
ప్రమాదానికి ముందుగా ఆర్మీ హెలిక్టాపర్లో రావత్ తోపాటు అతడి భార్య, బ్రిగెడ్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గుర్ సేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర , లెఫ్టినెంట్ నాయక్ వివేక్ కుమార్, లెఫ్టినెంట్ నాయక్ , బి. సాయి తేజ, హవ్ సత్పాల్ ఉన్నారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం 14మంది సూలూరు నుంచి వెల్లింగ్‌టన్‌కు హెలికప్టార్లో ప్రయాణించారు. ఈ హెలిక్టాప్టర్ సామర్థ్యం 24మంది కాగా 14మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా రావత్ ఆరోగ్య పరిస్థితిపై సస్సెన్స్ కొనసాగుతుండటంతో కాసేపట్లో కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం కన్పిస్తోంది.
Also Read: విశాఖ ఉక్క ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోందా?